వామ్మో.. నవ్వి నవ్వి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి.. ఇలాంటి జబ్బు కూడా ఉందా! అసలు డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనే నానుడి అందరికీ తెలిసిందే.

Update: 2024-06-10 09:07 GMT

దిశ, ఫీచర్స్: నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనే నానుడి అందరికీ తెలిసిందే. బేసిక్‌గా నవ్వడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలా మంది చెబుతుంటారు. ఏదైనా పెద్ద జోక్ విన్నప్పుడు మనం కామన్‌గా నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాను అని చెబుతుంటాము. అయితే ఇక్కడ ఆ మాటే నిజమయ్యేలా ఓ వ్యక్తి గట్టిగా నవ్వుతూ ఒక్కసారిగా మూర్చపోయి, ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా..హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కామెడీ షో చూస్తూ, ఒక కప్పు టీ తాగుతూ చాలా నిమిషాల పాటు నవ్వుతూ ఉండటం వల్ల అకస్మాత్తుగా మూర్చపోయాడని డాక్టర్ సుధీర్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత అతను లాఫ్టర్-ఇండ్యూస్డ్ సిన్కోప్ (laughter-induced syncope ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆ వ్యక్తికి అతనికి ఏం జరిగిందో గుర్తులేదని వైద్యుడు వెల్లడించాడు.

లాఫ్టర్-ఇండ్యూస్డ్ సిన్కోప్ అని పిలవబడే అసాధారణమైన వైద్య రుగ్మత ఎవరైనా చాలా సేపు నవ్వుతూ ఉండటం వల్ల మూర్ఛ పోయినప్పుడు సంభవిస్తుంది. దీనిని సాధారణంగా మూర్ఛ అని పిలుస్తారు, మూర్ఛ అంటే స్పృహ కోల్పోవడం, దీని వల్ల రక్తపోటు తగ్గడం ద్వారా మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీని ప్రధానమైన లక్షణం ఏంటంటే.. ఆకస్మికంగా స్పహ కోల్పోతుంటారు. వీటితో పాటు మైకం లేదా తల తిరగడం, చెమటలు మరియు వికారం కలగడం వంటి లక్షణాలు ఉంటాయి. నవ్వు ద్వారా వచ్చే మూర్ఛకు సంబంధించిన కొన్ని రిస్క్ వేరియబుల్స్‌పై కొన్ని అధ్యయనాలు చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కుటుంబంలో ఎవరికైనా ఛాతీ నొప్పి లేదా ఆకస్మిక మరణాలు వచ్చి ఉంటే.. ఆ కుటుంబంలో వారికి ఈ తరహా సమస్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. లాఫ్టర్-ఇండ్యూస్డ్ సిన్కోప్ రకానికి చెందిన మూర్ఛ సమస్యకు ప్రత్యేక చికిత్స లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనిని కొంతమేర తగ్గించవచ్చు.


Similar News