భోగి పండుగ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తున్నారా?

చూస్తుండగానే సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది.

Update: 2024-01-14 04:31 GMT

దిశ, ఫీచర్స్: చూస్తుండగానే సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున నిద్రలేచి భోగి మంటలను వెలిగిస్తున్నారు. ఆ మంటల చుట్టూ జనాలు ఆటపాటలతో సందడి చేస్తూ.. పాత వస్తువులను మంటలో వేస్తారు. అలాగే చిన్నారులకు భోగిపండ్లు పోస్తుంటారు. ప్రస్తుతం హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె వాసుల్లో కళ ఉట్టిపడుతుంది. ఈ రోజు చాలా మంది ప్రజలు అన్నదానం చేస్తుంటారు. దీంతో శుభ ఫలితాలు పొందుతారు.

భోగి నాడు అగ్నిదేవుడిని తప్పకుండా పూజించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. భోగి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి దానం చేయండి. మీకు ఏడాది పొడవునా మంచి జరుగుతుంది. నేడు మాంసం, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. భోగి పండుగ నాడు నలుపు రంగు దుస్తులు పొరపాటున కూడా ధరించకండి. ఒకవేళ ధరించినట్లైతే కీడు జరుగుతుందంటున్నారు పండితులు. కాగా నేడు నలుపు బట్టలు వేసుకోకండి.

భోగి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ఇష్టమైన పండగగా చెబుతుంటారు. కాబట్టి నేడు పెద్దలకు గౌరవం ఇవ్వాలి. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి పండుగ రోజే.


Similar News