అతి ఆదర్శాలు, గత వైభవాలు.. వర్తమానంలో నష్టం చేస్తాయంటున్న నిపుణులు

‘నోస్టాల్జియా’ ఇటీవల పలు సోషల్ మీడియా వేదికల్లో తరచూ కనిపిస్తున్న పదమిది. సైకాలజీ పరిభాషలో ఇలా పిలుస్తారు కానీ, అది వర్తమానంలోనూ గత కాలానికి సంబంధించిన ఆదర్శాలకు, ఐడియాలజీకి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ మధ్య అమెరికన్లు మునుపెన్నడూ లేనంతగా ఈ వ్యామోహనికి గురవుతున్నారని, అతి ఆదర్శాలు, గత వైభవాలను వర్తమానానికి అన్వయిస్తూ నష్టపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

Update: 2024-02-22 10:50 GMT

దిశ, ఫీచర్స్ : ‘నోస్టాల్జియా’ ఇటీవల పలు సోషల్ మీడియా వేదికల్లో తరచూ కనిపిస్తున్న పదమిది. సైకాలజీ పరిభాషలో ఇలా పిలుస్తారు కానీ, అది వర్తమానంలోనూ గత కాలానికి సంబంధించిన ఆదర్శాలకు, ఐడియాలజీకి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ మధ్య అమెరికన్లు మునుపెన్నడూ లేనంతగా ఈ వ్యామోహనికి గురవుతున్నారని, అతి ఆదర్శాలు, గత వైభవాలను వర్తమానానికి అన్వయిస్తూ నష్టపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని సానుకూల ప్రభావాలు ఉంటున్నప్పటికీ టూ మచ్ నోస్టాల్జియాకు డార్క్‌సైడ్ కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి, మానవ శ్రేయస్సుకు ప్రమాదకరం. ప్రధానంగా స్తబ్దత, ఆదర్శీకరణ వంటి అతి ధోరణులతో వర్తమానంలో విశ్వసనీయతను లేదా ప్రామాణికతను కోల్పోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ‘గతం యొక్క వ్యూహాత్మక అతి సరళీకరణ’గా పేర్కొంటున్నారు.

ఎదుగుదలకు ఆటంకం

వర్తమానంలో ఉండి కూడా గతానికి సంబంధించిన ఆదర్శాలపైనే ఆధారపడి జీవించడం స్తబ్దతకు కారణం అవుతుంది. ఎవరికీ నచ్చకపోయినా గత భావాలతో మెలగడం, వ్యక్తులను, సమాజాన్ని అదే కోణంలో చూడటం, ఇప్పుడు అలా లేవని బాధపడటం వంటి ధోరణలు టూ మచ్ నోస్టాల్జియాకు ఉదాహరణలు. కానీ ఇవి వ్యక్తిగత, ఆధునిక సామాజిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంతెందుకు సక్సెస్‌ఫుల్ మ్యూజికల్ గ్రూప్ తన హిట్‌లను మాత్రమే ప్లే చేసే సేఫ్టీని వదిలివేయడానికి నిరాకరిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే నోస్టాల్జియా మనల్ని ఎంకరేజ్ చేయగలదు. కొత్త అన్వేషణను, పురోగతిని నిరోధిస్తుంది.

ఆదర్శీకరణతో అవస్థలు

నోస్టాల్జియా భావాలు కలిగినవారు ఓవర్ సింప్లిసిటీని కూడా ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి భ్రమల్లో ఉండే వ్యక్తులు తమ జీవితంలోని వర్తమాన సంఘటనలను, సమస్యలను, సందర్భాలను అన్నింటినీ గతంతో పోల్చి పాటించడమో, బాధపడటమో చేస్తుంటారు. మనకు సంతోషం కలిగించే గత ఆదర్శాలు కొన్నిసార్లు మేలు చేయవచ్చు. ఎక్కువగా మన జ్ఞాపకాలను వ్యతిరేక దిశలో నడిపిస్తాయి. ప్రతి విషయంలో గతాన్ని ఆదర్శవంతం చేయడం, వాస్తవికతను విస్మరించడం, మానవ సంబంధాలు, సౌకర్యాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తనను గతంతో ఆదర్శీకరించి, ఆచరించడం వర్తమానంలో తప్పుడు పద్ధతిగానే చలామణి అవుతుంది. ప్రయాణ సౌకర్యాలు ఏవీ లేనప్పుడు గాడిదలమీద ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్తే ఖర్చులు తగ్గుతాయని, ఆరోగ్యానికి మంచిదని ఎవరైనా భావిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అనేక విషయాల్లో టూ మచ్ నోస్టాల్జియా ఇలాగే ఉంటుంది. ఇది పోలికల సంతృప్తి రూపంలోనూ వ్యక్తం అవుతుంది.

ప్రామాణికతను కోల్పోవడం

నోస్టాల్జియా తరచుగా వాస్తవంతో సంబంధం లేని అనుకరణను ప్రోత్సహిస్తుంది. అంటే మనం గతంలోని ట్రెండ్స్, ఫ్యాషన్స్, బిహేవియర్స్ అనుకరిస్తాం. ఉదాహరణకు 2024లో ఉన్న మనం 1940లో మాదిరిగా దుస్తులను ధరించడం, అన్ని విషయాల్లో అప్పటి పోకడలను అనుసరించడం చేయగలమా? కానీ నోస్టాలజిస్టులు అదే చేయాలంటారు. అప్పట్లో అలా చేయడంవల్లే మంచి జరిగిందని నమ్ముతుంటారు. ఈ విధమైన గత భావాలను వర్తమానంలోనూ ప్రజలపై, యువతపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనివల్ల ప్రామాణికతను, విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారతూ ఉంటుంది. 1990 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో పాపులారిటీ పొందిన సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు ఆ కాలానికి గొప్పవే. చెప్పుకోవడానికి జ్ఞాపకాలుగా ఉపయోగపడతాయి. కానీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లోనూ వాటినే వాడాలని ఎవరైనా బలవంతం చేస్తే ఎలా ఉంటుంది? అదే టూ మచ్ నోస్టాలజీ. ఇది పలాయనవాదాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.


Similar News