AI జనరేటెడ్ ఫొటోలు, వీడియోలను ఇలా ఈజీగా కనిపెట్టొచ్చు..
AI ప్రపంచాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా తమ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని ఎంప్లాయీస్ లో ఆందోళన మొదలైంది. మరోవైపు డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు జనాల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయి. సెలెబ్రిటీలతోపాటు సామాన్యుల పరువు, ప్రతిష్టలను మంట గలిపేస్తున్నాయి.
దిశ, ఫీచర్స్ : AI ప్రపంచాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా తమ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని ఎంప్లాయీస్ లో ఆందోళన మొదలైంది. మరోవైపు డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు జనాల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయి. సెలెబ్రిటీలతోపాటు సామాన్యుల పరువు, ప్రతిష్టలను మంట గలిపేస్తున్నాయి. ఇలా AI క్రియేట్ చేసిన ఇమేజెస్, క్లిప్స్ చూసి తట్టుకోలేని కొందరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇంతగా భయపడి పోవాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. రియల్ ఇమేజెస్, ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ మధ్య తేడా తెలుసుకునేందుకు ఈ టిప్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఫేషియల్ సిమ్మెట్రీ చెకింగ్
AI రూపొందించిన చిత్రాల్లో సాధారణంగా ముఖం సహజంగా ఉండదు. అన్ నేచురల్ సిమ్మెట్రీ కలిగి ఉంటాయి. అంటే నిజ జీవితంలో మనుషుల ముఖాలు స్వల్ప అసమానతలను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు అతిగా పర్ఫెక్ట్ లేదా సౌష్టవంగా కనిపించే ముఖాన్ని గమనించినట్లయితే ఏఐ క్రియేట్ చేసిందని నిర్ధారించుకోవచ్చ
ఎక్స్ ట్రాలు గమనించండి
AI కొన్నిసార్లు ఎలిమెంట్స్ ను విస్మరిస్తుంది. లేదా అదనంగా జోడిస్తుంది. ఉదాహరణకు మనిషి చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసే ఫొటోలో ఆరు లేదా ఏడు, ఎనిమిది ఉండొచ్చు. ఇలాంటి మైనర్ పాయింట్స్ తో డీప్ ఫేక్ వీడియోలు సులభంగా కనిపెట్టొచ్చు.
లైటింగ్, నీడ ఇంపార్టెంట్
AI జనరేటెడ్ ఫోటోలో లైటింగ్ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా కాంతికి అనుగుణంగా నీడ పడదు. షాడో మల్టిపుల్ డైరెక్షన్స్ లో లేదా అసహజంగా పడొచ్చు.
లైటింగ్ అనేది లైట్ సోర్స్ కు వ్యతిరేకంగా ఉండొచ్చు.
డిటైలింగ్స్ రియలిస్టిక్ ఉండకపోవచ్చు
AI డిటైలింగ్స్ వాస్తవంగా ఉండకపోవచ్చు. అంటే చర్మం, జుట్టు, ఫాబ్రిక్ ఆకృతి వంటి విషయాల్లో శ్రద్ధ చూపకపోవచ్చు. ముఖ్యంగా స్కిన్ చాలా మృదువుగా, కొంత అసహజంగా కనిపిస్తుంది. టెక్చర్స్, ఫినిషింగ్ సరిగ్గా ఉండవు.అలాంటప్పుడు ఇమేజ్ AI జనరేటెడ్ అయి ఉంటుంది.
సైంటిఫిక్ గా ఉండదు
AI రూపొందించిన ఫొటోలు, వీడియోలు గురుత్వాకర్షణను ధిక్కరించే విధంగా ఉంటాయి. అస్సలు పాజిబుల్ కానీ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు వస్తువులు గాలిలో తేలుతున్నట్లు, వాహనాలు ఒకదానిపై మరొకటి వెళ్తున్నట్లు ఉంటాయి. ఇలాంటి మైన్యూట్ డిటైల్స్ వెంటనే ఈ ఫోటోలు నిజం కాదని తేల్చేస్తాయి.
రిపీటేటివ్ ప్యాటర్న్
AI క్రియేషన్ కొన్నిసార్లు గమ్మత్తుగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్స్, ఆకులు, పువ్వులు, ఇటుకల వంటి వినియోగం రిపీటెడ్ గా ఉంటుంది. సహజ నమూనాల మాదిరిగా కాకుండా ఇష్టరీతిగా ఉంటాయి. ఒకదానిపై ఒకటి అదే రిపిటేటివ్ గా కనిపిస్తుంటుంది.
ముఖ, జుట్టు లక్షణాలు
AI ప్రొడ్యూస్ చేసిన ముఖాల కళ్లు, కనుబొమ్మలు, పెదాలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ దాదాపు ప్రతిబించినట్లు కనిపిస్తాయి. నిజమైన మానవ లక్షణాలకు సూక్ష్మమైన వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇక జుట్టు అయితే అస్సలు చిందర వందరగా ఉండదు. రియల్ లైఫ్ ఫొటోస్ లో కనిపించే లోపాలు, ఆకృతి అందులో ఉండదు.
బాడీ షేప్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పొడవుగా లేదా పొట్టిగా ఉండే అవయవాలు లేదా అసమాన శరీరాలను రూపొందిస్తుంది. ఈ క్రమరాహిత్యాలు ఫొటోను AI ద్వారా క్రియేట్ చేశారని చెప్పేస్తాయి.
రాంగ్ సింబల్స్, టెక్స్ట్
AI సాధారణంగా ఇమేజ్ లో టెక్స్ట్ ను సరిగ్గా రూపొందించలేదు. ఇది సాధారణంగా కొన్ని పొరపాట్లు చేస్తుంది లేదా కొన్ని సమయాల్లో అస్పష్టమైన, తప్పుగా రాయబడిన లేదా సరిగ్గా లైన్ లో లేని వాక్యాలను సృష్టిస్తుంది. సింబల్స్ కూడా తప్పుగా రిప్రెజెంట్ చేయబడుతాయి. ఇది ఫొటో AI తయారు చేసింది అనేందుకు స్ట్రాంగ్ ఇండికేషన్.