60's లో యంగ్‌గా కనిపించాలి అని అనుకుంటున్నారా..? అయితే ఈ యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే!

సాధారణంగా వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా సరే వృద్ధాప్యంలో అడుగు పెట్టాల్సిందే. దీన్ని ఆపడం అంత ఈజీ కాదు కానీ నియంత్రించొచ్చు.

Update: 2024-06-24 03:59 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా సరే వృద్ధాప్యంలో అడుగు పెట్టాల్సిందే. దీన్ని ఆపడం అంత ఈజీ కాదు కానీ నియంత్రించొచ్చు. అందుకోసం కొంతమంది మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్‌కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్‌లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా 60లలో కూడా యంగ్‌గా కనిపించాలంటే మాత్రం ఈ ఫుడ్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చు. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుంది. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్ తీసుకుంటే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బొప్పాయి: విటమిన్ ఏ, సీ, ఈ, కె పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది.

అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బబ్లీగా, మృదువుగా ఉంచుతాయి.

గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.

కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్‌లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది.

అల్లం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.

పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.

వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్‌ టోన్‌ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News