Goals @ 90/90/1.. సక్సెస్‌వైపు నడిపిస్తున్న న్యూ మెథడ్ !
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సమర్థులుగానే చలామణి అవుతారు.
దిశ, ఫీచర్స్: పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సమర్థులుగానే చలామణి అవుతారు. తమ లక్ష్యాలను ఈజీగా సాధిస్తారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ వాటిని సాధించగలిగితే.. అదే గ్రేట్ సక్సెస్ అంటున్నారు నిపుణులు. కాలం మీ కోసం ఆగదు. మీరు మాత్రమే దానివెంట పరుగెత్తాలి. అదే మిమ్మల్ని ఎటువంటి స్విచ్చువేషన్లనైనా ఎదుర్కొనేలా చేస్తుంది. మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అచీవ్‌మెంట్స్‌ను సులభతరం చేస్తుంది. నిరాశా నిస్పృహలను దూరం చేస్తుంది. అందుకే మంచి టైమ్, మంచి ముహూర్తం అంటూ వేచి చూడకుండా.. ఉన్న సమయంలోనే మంచి చేయడానికి, గోల్స్ సాధించడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం 90/90/1 మెథడ్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ పురోగతి సాధిస్తారని ఫేమస్ రైటర్ అండ్ స్పీకర్ రాబిన్ శర్మ పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం.
స్టడీ, లైఫ్ అండ్ కెరీర్.. ఇలా ఏ గోల్స్ అయినా సరే, ఈజీగా అచీవ్ కావడంలో గొప్పగా ఉపయోగపడే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీగా 90/90/1 రొటీన్ మెథడ్‌ను యూజ్ అవుతుంది. మీ ప్రయారిటీ కోసం 90 రోజులపాటు ప్రతి రోజు జస్ట్ 90 నిమిషాల పాటు మీకోసం సమయం కేటాయించుకోండి. నెక్ట్స్ మీ ‘గేమ్-ఛేంజ్ మూవ్’ని పరిష్కరించడానికి షెడ్యూల్ చేయండి. దీనివల్ల మీరు లేజర్ - షార్ప్ ఫోకస్‌ను డెవలప్ చేస్తారు. అదే మిమ్మల్ని ఆల్టిమేట్‌గా సాధించాల్సిన గోల్స్ వైపు నడిపిస్తుంది. అందుకోసం మీరు ముందుగా చేయాల్సిందల్లా ప్రయారిటీస్ గుర్తించడం, ముందుకు సాగడమే. అలాగనీ మల్టీ టాస్కింగ్ చేయాలనే అత్యుత్సాహం కూడా వద్దంటున్నారు నిపుణులు. మీ గోల్స్‌ను చేరుకోగల అత్యంత ముఖ్యమైన ప్రోగ్రెస్‌ను అందించే డైలీ రొటీన్ సెలెక్ట్ చేసుకోండి. అది మీ బుక్ చాప్టర్‌ను రాయడం కావచ్చు లేదా బిజినెస్ పిచ్‌ను పర్‌ఫెక్ట్ చేయడం కావచ్చు. ఫైనల్లీ కోడింగ్ లాంగ్వేజ్‌లో స్కిల్స్ సంపాదించడం అయినా కావచ్చు.
ప్రొడక్టివిటీ.. క్లారిటీ
90/90/1 మెథడ్ డైలీ రొటీన్‌గా మారితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు సాధించాల్సిన విషయాలపై ఫోకస్ పెడతారు. తక్కువ సమయంలో సాధించే దిశగా అడుగులు వేస్తారు. అలాగే నిర్లక్ష్యం, పరధ్యానం వంటివి దూరం అవుతాయి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడంవల్ల సమయం వృథా చేయలేరు. దీంతో మీరు స్టూడెంట్ అయితే చదువులో, ఎంప్లాయి అయితే వర్కులో, ప్లేయర్ అయితే గేమ్స్‌లో ఇలా.. సెక్టార్ ఏదైనా సరే.. మీ యాక్టివిటీ, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అలాగే మీరు చేయాల్సిన పనులపై క్లారిటీ వస్తుంది. మీ ‘గేమ్-ఛేంజింగ్ మూవ్’ని గుర్తించే ప్రాసెస్‌లో ఆల్టిమేట్ గోల్ కోసం ట్రై చేస్తారు. తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ స్టెప్స్‌పై క్లారిటీ రావడంలో ఈ మెథడ్ హెల్ప్ అవుతుంది. అప్పుడు మీరు మీ పనిపై మరింత హైపర్ ఫోకస్ చేయవచ్చు.
ఆత్మ విశ్వాసంతో షెడ్యూల్ చేయండి
తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రొడక్టివిటీ, నిరంతర కృషి ఫలితం మిమ్మల్ని పురోగతివైపు నడిపించడంతోపాటు మీ సామర్థ్యాలపై మీకు నమ్మకాన్ని పెంచుతాయి. కంటిన్యూ చేయడంలో ప్రేరణను లభిస్తుంది. కాన్ఫిడెంట్ లెవల్స్ పెరగడంవల్ల మీలో స్ట్రెస్ తగ్గుతుంది. చేయాల్సిన వర్క్ లిస్టును సింప్లిఫైడ్ చేయడం ద్వారా, ప్రయారిటీపై ఫోకస్ పెట్టడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. ఇక మీ పనులు, లక్ష్యాలను అమలు చేసే క్రమంలో ప్రధానంగా ‘గేమ్-ఛేంజ్ మూవ్’ని గుర్తిస్తూ, లక్ష్యం వైపు సాగడమే. అయితే గోల్ సాధించే క్రమంలో ఎలాగైనా సక్సెస్ రావాలని అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా ఉండండి. మంచిమార్గంలో నడుస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందుల గురించి అతిగా ఆలోచించకండి. డిస్ట్రక్షన్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేయండి. అవసరమైతే మీ ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచండి. సిస్టంపై కూర్చున్నప్పుడు అవసరంలేని ట్యాబ్స్‌ను క్లోజ్ చేయండి. ఇలా ప్రతిరోజూ 90/90/1 రొటీన్‌లో భాగంగా మీ 90 నిమిషాల సమయాన్ని తెలివిగా షెడ్యూల్ చేస్తూ ప్రొసీడ్ అయితే చాలు. మీ సక్సెస్ జర్నీకి అడ్డంకులనేవే ఉండవు.