Viral News: 7500 పాములు ఒకే చోట.. స్నేక్స్ హనీ మూన్ స్పాట్ ఇదే
Worlds Largest Snake Gathering: ప్రపంచంలో వింత ప్రదేశాలు చాలా ఉన్నాయి.
దిశ, వెబ్ డెస్క్: Worlds Largest Snake Gathering: ప్రపంచంలో వింత ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడ జరిగే వింత సంఘటనలతో అవి ప్రసిద్ధి చెందాయి. కానీ కెనడాలోని నార్సిస్సేలో వేలాది పాములు గుమిగూడతాయి. నార్సిస్సేలో పాములకు హనీమూన్ స్పాట్ అట. ఏంటి వింతగా అనిపిస్తుందా? అవును మేము చెప్పేది నిజమే. కెనడాలోని నార్సిస్సేలో ఒక వింత సంఘటన జరుగుతుంది. ఇక్కడ వేలాది పాములు గుమిగూడుతాయి. ఈ ప్రాంతానికి 75000 కంటే ఎక్కువ పాములు వస్తాయని చెబుతున్నారు.
ఈ పాములలో ప్రధానంగా గార్టర్ పాములు ఉంటాయి. శీతాకాలం ముగిసిన వెంటనే అవి వెచ్చదనం, సాహచర్యం కోసం ఇక్కడికి వస్తుంటాయి. ఈ ప్రదేశంలో మగ, ఆడ పాములు సంతానోత్పత్తి కోసం సమావేశమవుతాయి. ఈ ప్రాంతాలు వాటిని గడ్డకట్టే వాతావరణం నుంచి సురక్షితంగా ఉంచుతాయి. వసంత కాలం రాగానే మేల్కొని ముందుగా మగ పాములు జత కోసం వెతుకుతాయి. సరైన తోడుగా భావించే ఆడ పాములు వాటితో కలుస్తాయి. మగపాములు ఆడ పాముల చుట్టూ గుంపులుగా తిరుగుతాయి. ఆడపామును గెలవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రాసెస్ ను మేటింగ్ బాల్ అంటారు. ఆడపామును ఆకర్షించేందుకు మగని ఫెరోమోన్లు అనే ప్రత్యేక సువాసనలను ఉపయోగిస్తాయి. ఇలా చాలు పాములు ఒకే దగ్గర కలవడం అరుదైనది. ఈ అతిపెద్ద పాముల సమావేశం మానిటోబాలోని నార్సిస్సేలో జరుగుతుంది. ఈ ప్రత్యేక దృగ్విషయాన్ని నార్సిస్ స్నేక్ డెన్స్ అంటారు.ఈ సమయంలో 75,000 నుండి 1,50,000 వరకు గార్టర్ పాములు ఇక్కడకు వస్తాయని చెబుతున్నారు.
అయితే ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ కంట్రోల్లో ఉంటుందట. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ ప్రాంతం ఓ ప్రధాన ఆకర్షణగా మారిది. అయితే కాదు ఈ నార్సిస్ స్నేక్ డెన్ సమయంలో వేలాది పాములు చనిపోతాయట.