అవాంఛిత గర్భం గురించి ఆందోళన..? కండోమ్, పిల్స్ కాదు ఈ కంఫర్టబుల్ టెక్నిక్స్ బెటర్..
అవాంఛిత గర్భాన్ని నివారించాలని అనుకుంటున్నారా? గర్భనిరోధక శక్తిపై నమ్మకం ఉంచమని సూచిస్తున్నారు నిపుణులు. సాధారణంగా కండోమ్స్, పిల్స్ ఇందుకోసం వినియోగించడంపై అవగాహన ఉన్నప్పటికీ.. ఇంకా చాలా పద్ధతుల గురించి తెలియాల్సి ఉంది. సాధారణ జనాలకు కూడా అందుబాటులో ఉండే వివిధ రకాల గర్భనిరోధకాల గురించి తెలుసుకుందాం.
దిశ, ఫీచర్స్ : అవాంఛిత గర్భాన్ని నివారించాలని అనుకుంటున్నారా? గర్భనిరోధక శక్తిపై నమ్మకం ఉంచమని సూచిస్తున్నారు నిపుణులు. సాధారణంగా కండోమ్స్, పిల్స్ ఇందుకోసం వినియోగించడంపై అవగాహన ఉన్నప్పటికీ.. ఇంకా చాలా పద్ధతుల గురించి తెలియాల్సి ఉంది. సాధారణ జనాలకు కూడా అందుబాటులో ఉండే వివిధ రకాల గర్భనిరోధకాల గురించి తెలుసుకుందాం.
గర్భాశయంలో పరికరాలు(IUD)
IUD లు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. T- ఆకారంలో ఉండే ఈ పరికరాలు.. గర్భాశయంలో ఉంచడం ద్వారా గుడ్డు ఫలదీకరణం జరగకుండా స్పెర్మ్ ను నిరోధిస్తాయి. ఇవి చాలా ఏళ్లు అలాగే ఉంచవచ్చు. గర్భం పొందాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు రిమూవ్ చేయవచ్చు.
ఇంప్లాంట్స్
చర్మం కింద అమర్చిన చిన్న రాడ్ లాంటి పరికరం గర్భాన్ని నిరోధించే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. అండాశయం గుడ్డు విడుదల చేయకుండా అడ్డుకోవడం, శుక్ర కణాలు గర్భాశయ ముఖద్వారం చేరుకోకుండా పని చేస్తాయి.
పాచెస్
చర్మంపై ధరించే గర్భనిరోధక పాచెస్ అండోత్సర్గము నిరోధించేందుకు హార్మోన్లను విడుదల చేస్తాయి. పూర్తి ప్రభావం కోసం వారానికోసారి కొత్తవి ధరించాల్సి ఉంటుంది.
యోని రింగ్స్
చిన్న పరిమాణంలో ఉండే యోని రింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వెజీనాలోకి ఫిక్స్ చేశాక.. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల విడుదల చేస్తాయి. ఇవి అండోత్సర్గాన్ని అడ్డుకుంటాయి.
స్టెరిలైజేషన్
పూర్తిగా పిల్లలు వద్దనుకునే వారికి ఈ పద్ధతి సూచించబడుతుంది. ట్యూబల్ ఇలిగేషన్ లేదా వేసెక్టమీ ఇకపై గర్భం రాకుండా చేస్తుంది. మళ్లీ పిల్లలు కావాలని అనుకున్నా కష్టమే.
గర్భనిరోధక ఇంజెక్షన్
గర్భం రాకుండా ప్రతి మూడు నెలలకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. ఇవి అండోత్సర్గము నిరోధిస్తాయి. అయితే సౌకర్యంగా ఉంటాయి కానీ సకాలంలో ఫాలో అప్ మోతాదులు అవసరం.