Current bill : అద్దె ఇంట్లో అతిగా కరెంట్ బిల్లు వస్తుందా.. ఈ టిప్స్ పాటించండి!
ప్రతి నెల కరెంట్ బిల్లు కట్టడం అనేది చాలా మందికి ఇబ్బంది పెట్టే అంశమే.నెల నెల కరెంట్ బిల్లు ఎంత వస్తుందని పదే పదే చెక్ చేస్తుంటారు. ఒక నెల ఎక్కువ బిల్లు వస్తే చాలు, చాలా మంది ఏంటీ
దిశ, ఫీచర్స్ : ప్రతి నెల కరెంట్ బిల్లు కట్టడం అనేది చాలా మందికి ఇబ్బంది పెట్టే అంశమే.నెల నెల కరెంట్ బిల్లు ఎంత వస్తుందని పదే పదే చెక్ చేస్తుంటారు. ఒక నెల ఎక్కువ బిల్లు వస్తే చాలు, చాలా మంది ఏంటీ ఇంత వచ్చేస్తుందని తెగ హైరానా పడిపోతారు. ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉన్న వారికి కొందరికి అధికంగా కరెంట్ బిల్లు వస్తుంది. దీంతో ఇంటి అద్దె, ఖర్చులు, కరెంట్ బిల్లు వారికి భారంగా మారుతుంటుంది. దీంతో చాలా మంది కరెంట్‌ను ఎలా ఆదా చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికే ఈ సమాచారం. కరెంట్ బిల్లు ఎక్కువ రాకుండా ఉండాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం.
1. ఇంటిలో ఉన్న బల్బులన్నీ ఎల్ ,ఈ,డీ,కి మార్చుకోవడం మంచిది. దీని వలన కరెంట్ ఆదా చేసుకోవచ్చు.
2. వాటర్ హీటర్ ఉంది కదా అని ఎక్కువగా వాడటం వలన కరెంట్ బిల్లు అధికంగా వస్తుందంట. అందువలన దాని వాడకం తగ్గించాలి.
3. కరెంట్ బిల్లు డ్యూ పెట్టకుండా, సరైన టైమ్‌కు కట్టేయాలంట.
4.బయటకు వెళ్లిన ప్రతి సారి రూమ్‌లోని లైట్స్, ఫ్యాన్స్, స్విచెస్ ఆఫ్ చేయాలి, లేకపోతే కరెంట్ బిల్లు అధికంగా వస్తుంది..
5. అనవసరమైన విద్యుత్ ఉపకరణాలు కొనకూడదు. హెయిర్ డ్రయ్యర్,రైస్ కుక్కర్, విద్యుత్ స్టవ్ లాంటివి కొనుగోలు చేసి వాడటం వలన కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
6. వాటర్ ట్యాంక్ మోటార్, గీజర్ స్విచెస్ వేసి మర్చిపోతుంటారు అలా చేయకూడదు.
7. వాడనప్పుడు సాకెట్‌ల నుంచి ప్లగ్ తీసి వేసి స్విచ్ బటన్ ఆఫ్ చేయాలంట.
౮.మనం తీసుకునే ఫ్రిజ్, ఏసీ లాంటి విద్యుత్ ఉపకరణాలు స్టార్ రేటింగ్ 4 ఉండేలా చూసుకోవాలంట.