మీ పిల్లలు హైట్ పెరగాలా.. ఈ టిప్స్ పాటించండి!
హైట్‌గా ఉన్నవారు చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. వారిని చూస్తే చాలు కడుపు నిండిపోతుంది వారి పిల్లలకు. ఇక పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది. కొంత మంది పిల్లలు ఏం తినకపోయినా
దిశ, ఫీచర్స్ : హైట్‌గా ఉన్నవారు చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. వారిని చూస్తే చాలు కడుపు నిండిపోతుంది వారి పిల్లలకు. ఇక పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా ముఖ్యమైనది. కొంత మంది పిల్లలు ఏం తినకపోయినా త్వర త్వరగా హైట్ పెరుగుతూ ఉంటారు,మరికొంత మంది మాత్రం చాలా పొట్టిగా ఉంటారు. ఎంత తిన్నా, వారు పొట్టిగానే ఉంటారు.
తమ పిల్లల ఎదుగుదల సరిగా లేకపోతే ఆ పేరెంట్స్ చాలా ఆందోళనకు గురి అవుతుంటారు. వారు హైట్ పెరగడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొటిన్ పౌడర్ తీసుకొచ్చి వారికి తాగిపిస్తూ ఉంటారు.అయితే ఇలా మార్కెట్లో లభ్యమయ్యే పౌడర్స్ వల్ల పిల్లల ఊబకాయంతో, చిన్న వయసులోనే అనేక రకాలైన సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అందువలన పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవాలంట.
50 గ్రాముల నువ్వులు, 200 గ్రాముల మఖానా, 100 గ్రాముల బాదం, 100 గ్రాముల సొంపు తీసుకుని వీటిని చిన్న మంటపై బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత, ఒకేసారి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.ఇక ఇది వేడికాస్త తగ్గాక ఓ బాక్స్‌లో స్టోర్ చేసుకొని, రోజూ ఉదయం పాలలో కలిపి ఇవ్వాలంట. దీంతో మీ పిల్లలు ఈజీగా హైట్ పెరుగుతారు.