బ్యూటీ ట్రెండ్స్.. కొన్ని హానికరమని తెలిసినా ఎందుకు ఫాలో అవుతాం?
బ్యూటీ ట్రెండ్స్ ఎల్లప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఉన్నంతలో తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. ఫిజికల్ పర్‌ఫెక్షన్, ఎక్స్‌టర్నల్ బ్యూటీని సొంతం చేసుకోవడానికి కష్టపడుతుంటారు.
దిశ, ఫీచర్స్ : బ్యూటీ ట్రెండ్స్ ఎల్లప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఉన్నంతలో తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. ఫిజికల్ పర్‌ఫెక్షన్, ఎక్స్‌టర్నల్ బ్యూటీని సొంతం చేసుకోవడానికి కష్టపడుతుంటారు. మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అయితే గతం నుంచి ఇప్పటి వరకు సౌందర్య సాధనాల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన కొన్ని ప్రాణాంతకమైన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మేకప్ నుంచి ఇతర సౌందర్య వ్యామోహాల వరకు అటువంటి హానికరమైన బ్యూటీ ట్రెండ్స్ ఏంటో చూద్దాం.
వెనీషియన్ సెరస్
వెనీషియన్ సెరస్ అని పిలువబడే లెడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గత శతాబ్దాలలో సౌందర్యాన్ని పెంచేవిగా ఉత్పత్తులుగా ఉండేవి. చర్మాన్ని అందంగా తెల్లగా మారర్చే ఒక పాపులర్ సౌందర్య సాధనంగా సీసాన్ని ఉపయోగించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఎలిజబెత్ I కూడా తన పాలిపోయిన ముఖాన్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేసుకునేందుకు దీనిని వాడినట్లు చెప్తారు. ఇప్పటికీ సీసంతో తయారయ్యే బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. కానీ వీటివల్ల చర్మం దెబ్బతినడం, గ్రే హెయిర్ రావడం, జుట్టు రాలడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. గత శతాబ్దంలో లెడ్ వినియోగంవల్ల మరణాలు కూడా సంభవించాయని చెప్తారు.
ఆర్సెనిక్ బ్యూటీ
ఆర్సెనిక్ అనేది లెడ్ తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్‌లోకి ప్రవేశించింది. ఇది విక్టోరియన్ ఎరాలో కాంప్లెక్షన్ వైట్‌నర్‌గా కూడా ఉపయోగించబడింది. ఈ టాక్సిక్ కాంపోనెంట్ భాగం ఎర్ర రక్త కణాలను చంపుతుంది. దీనివల్ల చర్మం పాలిపోవడం, చివరికి మరణించడం కూడా జరగవచ్చు. అందంపై మోజుతో దానిని వాడటంవల్ల ఎందరో ప్రమాదంలో పడ్డారు.
పాదరసం
పాదరసం ఇప్పటికీ వివిధ చర్మ సౌందర్య ఉత్పత్తులలో కనిపించే మరొక ప్రమాదకర మూలకం. మచ్చలను ఎదుర్కోవడానికి దీనిని యూజ్ చేస్తారు. కానీ ఇది చర్మానికి హానికూడా చేస్తుంది. అందుకే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)దాని వాడకంపట్ల హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో విషపూరిత పదార్థం ఉంటుందని పేర్కొన్నది. డిప్రెషన్ నిరాశ, జలదరింపు, వణుకు వంటివి సమస్యలకు కారణం అవుతుంది.
బెల్లడోన్నా హెర్బల్ ప్లాంట్
బెల్లడోనా అనేది ఒక హెర్బల్ ప్లాంట్ ఇది చాలా ప్రాణాంతకం. సౌందర్య సాధనాలలో అనిమే పాత్రల (anime characters) మాదిరి స్త్రీలు మరింత అందంగా, అట్రాక్షన్‌గా కనిపించేలా చేయడానికి పుపిల్స్ విస్తరించడానికి ఐ డ్రాప్స్‌లో దీనిని గతంలో ఉపయోగించారు. కానీ చాలామంది దీనివల్ల కళ్ల సమస్యలు ఎదుర్కొన్నారు. కొందరు అంధత్వాన్ని కూడా ఎదుర్కొన్నారు. అందుకే ప్రస్తుతం దీనివాడకాన్ని నిలిపివేశారు.
రేడియం బ్యూటీ ట్రెండ్
చర్మం, ముఖంపై ముడుతలకోసం ట్రీట్మెంట్ చేయడానికి 20వ శతాబ్దంలో అసలు రేడియేషన్ ఉపయోగించబడింది. ఇది సాధారణంగా టూత్‌పేస్ట్, హెయిర్ క్రీమ్స్, ఇతర వస్తువులలో కనిపిస్తుంది. దాని నివారణ సామర్థ్యాల కారణంగా కనుగొనబడింది. రేడియం రేడియేషన్‌కు గురికావడం వల్ల క్యాన్సర్, ఇతర అనారోగ్యాలు సులభంగా వస్తాయి. అందువల్ల ఇకపై సౌందర్య సాధనాలలో ఉపయోగించ కూడదని ఆయా దేశాలు నిషేధించాయి.
హెయిర్ రిమూవల్ ఎక్స్‌రే
హెయిర్ రిమూవల్ క్రీములు.. వివిధ సందర్భాల్లో ముఖ్యంగా వాక్సింగ్ చేసే ముందు కూడా ఉపయోగిస్తుంటారు. X-కిరణాలతో వెంట్రుకలను తొలగిస్తారు. తొలుత 20వ శతాబ్దంలో ఎక్స్-రే హెయిర్ రిమూవల్స్ కనుగొనబడ్డాయి. త్వరగా ఉపయోగించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు తొలగింపు కోసం పేషెంట్లు 20 గంటల వరకు ఎక్స్-రే కింద ఉండవలసి ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గంలో చాలామంది మహిళలు చర్మంపై ముడతలు, మందంగా మారడం, తర్వాత జీవితంలో క్యాన్సర్‌తో బాధపడటం వంటివి దీనివల్లే జరిగాయి.
పందికొవ్వుతో కర్లీ విగ్స్
1700లలో స్టిఫ్ హెయిర్ అండ్ కర్లీ విగ్స్ వాడుకలో ఉన్నప్పుడు పంది కొవ్వును యూజ్ చేసేవారు. ప్రజలు ఈ గుంక్‌ను తమ జుట్టులో ఉంచుకునేవారు. దీనివల్ల విగ్ చాలా రోజులు మనగలిగేది. అయితే ఈ బ్యూటీ మోజు అంతర్లీనంగా ప్రమాదకరమైనది కానప్పటికీ అపరిశుభ్రంగా, అసహ్యంగా అనిపించేలా చేస్తుంది.
ఐలాష్ ఎక్స్‌టెన్షన్స్
అలాగే కనురెప్పల పొడిగింపు(Eyelash extensions) పద్ధతి1899లో అందుబాటుకి వచ్చి పాపులర్ అయింది. అప్పటి నుంచి కొందరు స్త్రీలు తమ కనురెప్పల అందంకోసం కంటికి దిగువ సరిహద్దులో కొకైన్‌ను రుద్దడం వంటివి చేసేవారు. ఇపప్పటికీ అందుబాటులో ఉంది. ఈ ప్రాసెస్‌లో జుట్టును తల నుంచి తీసి కనురెప్పల అంచుల ద్వారా థ్రెడ్ చేస్తారు. వాస్తవానికి ఐలాష్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి ప్రెట్టీ పెయిన్ ఫుల్ ప్రాసెస్
బ్రెజిలియన్ బ్లో అవుట్
2011లో FDA బ్రెజిలియన్ బ్లో అవుట్‌కి ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రొఫెషనల్ స్మూతింగ్ ట్రీట్‌మెంట్లలో వినియోగించడం ప్రమాదమని చెప్పింది. దాని హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రొడక్టర్స్‌లలో ఒకదాని వినియోగాన్ని తప్పుబట్టింది. ఇది ఫార్మాల్డిహైడ్‌ని కలిగి ఉంది. అయితే దీనిని బ్రాండ్ ‘ఫార్మల్డిహైడ్-ఫ్రీ’ అని తప్పుగా లేబుల్ చేసింది. బ్రెజిలియన్ బ్లో అవుట్ సమ్మేళనం మానవ ఆరోగ్యానికి హానికరం. ప్రపంచంలోని అనేక దేశాలలో నిషేధించబడింది.
బ్రెజీలియన్ టానింగ్
బ్రెజిల్‌లో లేడీస్ పర్‌ఫెక్ట్ టాన్‌లైన్స్‌ను పొందడానికి ‘మార్కిన్‌హాస్’ కోసం మాస్కింగ్ టేప్‌ను ఉపయోగించి టీనేయెస్ట్ బికినీలను కూడా తయారు చేస్తున్నారు. ఈ విచిత్రమైన బ్రెజిలియన్ (Bizarre Brazilian) టానింగ్ ట్రెండ్ సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రావయొలెట్ కిరణాల నుంచి కూడా రక్షిస్తుందనే ప్రచారం ఉంది. కానీ అందులోని కెమికల్స్‌తో నష్టం.