ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ గా వైట్‌రైస్ తినేవారు.. వీటి గురించి తెలుసుకోవాలి!
ఇప్పుడు యువకులు ఉదయం 11 గంటలకు అల్పాహారం తీసుకుంటున్నారు.
దిశ, ఫీచర్స్: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేచిన మొదలు ఏదొక పని చేస్తూనే ఉంటారు. కానీ, సరైన సమయానికి భోజనం చేయరు. సాధారణంగా అందరూ ఉదయం 10 గంటల లోపు టిఫిన్ తింటారు. ఇప్పుడు యువకులు ఉదయం 11 గంటలకు అల్పాహారం తీసుకుంటున్నారు. ఇప్పుడు టిఫిన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం, పూర్వీకులు ఉదయం అల్పాహారం లేకుండా వైట్ రైస్ తిని పనికి వెళ్ళేవారు. అప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నిజానికి వారు మనకంటే శారీరకంగా బలవంతులని చెప్పొచ్చు.
కానీ ఇప్పటి తరం వారు అల్పాహారానికి బదులు అన్నం తింటే బరువు పెరుగుతారని, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. ఉదయాన్నే అన్నం తినడం మంచిదా? కాదనేది ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయాన్నే అన్నం తింటే శరీరానికి శక్తి వస్తుంది. అయితే తెల్ల బియ్యం మోతాదు తక్కువగా ఉండాలి. ఉదయం లేవగానే శరీరం చురుగ్గా ఉండాలి. శక్తి కూడా ముఖ్యం. ఈ సమయంలో బరువును కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట అన్నం తింటే.. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అయితే ఉదయం పూట ఎక్కువ మోతాదులో అన్నం తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే మంచిది. అలా కాకుండా, అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.