రోజుకొకసారి భోజనం చేసే వాళ్ళు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!
బరువు తగ్గడానికి మనలో చాలా మంది ముందుగా ఫుడ్ డైట్ ని పాటిస్తుంటారు
దిశ, ఫీచర్స్: బరువు తగ్గడానికి మనలో చాలా మంది ముందుగా ఫుడ్ డైట్ ని పాటిస్తుంటారు. దీని కోసం వారు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. అయితే, రోజంతా ఆరోగ్యంగా ఉండటం కోసం, పండ్లను తీసుకుంటారు. కానీ, ఈ అలవాటు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ శరీరం విటమిన్లు మరియు మినరల్స్ వంటి పోషకాలలో లోపానికి కారణమవుతుంది. రోజుకొకసారి భోజనం చేయడం వలన మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది
తక్కువ ఆహారం తీసుకునే వారు కూడా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. శరీరానికి సరైన పోషకాహారం అందదు. ఈ స్థితిలో, ప్రేగులు ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను గ్రహించడం కష్టమవుతాయి.
రోగనిరోధక శక్తి
శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకోకపోవడం వలన పోషకాల లోపానికి దారితీస్తుంది, ఇది రోగనిరోధక శక్తి బలహీనపడటానికి కూడా దారితీస్తుంది. అంతేకాకుండా, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మలబద్ధకం సమస్య
తక్కువ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఆహారం నుండి శరీరానికి చాలా ఫైబర్ లభిస్తుంది. మీరు ఆహారం తీసుకోవడం తగ్గించినప్పుడు, ఫైబర్ క్రమంగా తగ్గుతుంది. దీని వలన మలబద్ధక సమస్య పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.