వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు.. ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

ఇది ఆడవారికి కలిగే సాధారణ సమస్య.

Update: 2024-05-28 06:09 GMT

దిశ, ఫీచర్స్ : వైట్‌ డిశ్చార్జ్‌ సమస్యతో చాలామంది బాధ పడతారు. ఇది ఆడవారికి కలిగే సాధారణ సమస్య. ఈ వైట్‌ డిశ్చర్జ్‌ ఒక రకమైన సమస్య కాదు.. మనిషిని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. ఈ సమస్య గురించి చెప్పాలన్నా కూడా మహిళలు సిగ్గుపడుతుంటారు. కానీ దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలసట, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ఋతుస్రావం, గర్భం, హార్మోన్ల మార్పుల కారణంగా వైట్ డిశ్చార్జ్ పెరుగుతుంది. గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్, గర్భాశయ వాపు వంటి ఇతర పరిస్థితులు వైట్ డిశ్చార్జ్‌కు కారణమవుతాయి. ట్రికోమోనియాసిస్ వంటి యోని ఇన్ఫెక్షన్లు వైట్ డిశ్చార్జ్, దురద, చికాకు కలిగించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

మసాలా, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటికి బదులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి. నీరు, లస్సీ వంటి ద్రవాలు ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయండి. అలాగే పొడి దుస్తులను ధరించండం చాలా అవసరం. యోని pH స్థాయిని సమతుల్యత చేయడానికి క్రీములను వాడండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News