ఈ టాబ్లెట్ వేసుకుంటే మందు ముట్టరంతే..

మందు కొడితే మా కన్నా గొప్పోడు లేడని ఫీల్ అయిపోతారు మందుబాబులు. ఆల్కహాల్ అధికంగా తీసుకునేందుకు కారణమిదే. కాగా మద్యపానం మెదడులో డోపమైన్ రిలీజ్ చేస్తుంది.

Update: 2024-10-18 16:48 GMT

దిశ, ఫీచర్స్ : మందు కొడితే మా కన్నా గొప్పోడు లేడని ఫీల్ అయిపోతారు మందుబాబులు. ఆల్కహాల్ అధికంగా తీసుకునేందుకు కారణమిదే. కాగా మద్యపానం మెదడులో డోపమైన్ రిలీజ్ చేస్తుంది. దీనిద్వారా ఏర్పడే ఉల్లాసమైన ప్రభావంతో రిలాక్స్ గా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పొందడమే కాదు జీవితం పట్ల సానుకూల అనుభూతిని పొందుతారు. దీనివల్ల తాగుడుకు బానిస అవుతారు. అయితే ఇలాంటి వ్యసనపరులను సాధారణం చేసేందుకు, మందు మాన్పించేందుకు నాల్ట్రెక్సోన్ అని పిలవబడే మాత్ర బాగా పని చేస్తుందని చెప్తున్నారు నిపుణులు.

ఈ పిల్ మద్యపానంతో ముడిపడి ఉన్న ఆనందం అనుభూతిని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. తాగాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. మద్యంపై తక్కువ ఆధారపడేలా చేస్తుంది. దీంతో డ్రింకర్స్ అనారోగ్య వ్యసనం నుండి బయటపడవచ్చు. కాలక్రమేణా పూర్తిగా మానేయొచ్చు. ఆల్కహాల్ కోరికలను తగ్గించడానికి మెదడును రివైర్ చేసే మాత్ర ఒక గేమ్‌ఛేంజర్‌గా ఉంటుంది. ఎందుకంటే మితంగా లేదా ఎక్కువగా తాగే వ్యక్తులు, చేయని వారి కంటే ఎక్కువ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. CDC ప్రకారం.. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడం వల్ల స్టమక్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మితమైన, భారీ ఆల్కహాల్ వినియోగం పెద్దప్రేగు, పురీషనాళం క్యాన్సర్ల ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


నోట్.. పై సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది.. 

Tags:    

Similar News