మీ ఇంటి ముందు కాకి తరచూ తిరిగితే జరగబోయేది ఇదే
మానవ ఆచార వ్యవహారాల్లో శకునాల పాత్ర ఎక్కువగా ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్ : మానవ ఆచార వ్యవహారాల్లో శకునాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. శకునాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి మంచి శకునాలు, చెడు శకునాలు. మంచి శకునాలు మనం చేసే పనులు శుభాన్ని కలుగజేస్తాయి. చెడు శకునాలు మనం చేసేటటువంటి పనిలో అశుభాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనం ఏ పని ప్రారంభించిన మంచి శుభ సమయం చూసుకొని శుభ శకునం చూసుకొని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే అశుభ శకునం ఎదురైతే ఆ పని సంపూర్ణంగా నిలుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఒక నమ్మకం ఉంది. మంచి శకునం ఎదురవ్వడం వలన తల పెట్టిన కార్యం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది.
కాకి యొక్క శుభ, అశుభ శకునాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనం మన దేశంలో మిగతా పక్షుల కంటే ఎక్కువగా కాకికి విశేషం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. కానీ మనం పితృ దేవతల యొక్క ప్రతినిధిగా హిందూ ధర్మ శాస్త్రము కాకి అని చెబుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టె పిండాన్ని కాకి ఆరగిస్తే.. వాళ్ల ఆత్మ శాంతిస్తుందని నమ్ముతుంటారు. కాకి పిండం ముట్టకపోతే వారి ఆత్మ చాలా కోపంగా ఉందని మన పెద్దలు చెబుతుంటారు. మీ ఇంటి ఎదురుగా ఒక కాకి కాకుండా , నాలుగైదు కాకులు వచ్చి తిరుగుతూ ఉంటె.. మీకు కీడు జరగబోతుందని అర్ధం. కాకి ఎగురుతూ మన తలా మీద తన్నితే అది అశుభమట. కాకి మీద పడితే తల స్నానం చేసి వేటిని పెట్టుకోకుండా మన ఇష్ట దైవాన్ని ప్రార్ధించాలి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు కాకి కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తే అది శుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు.
Read More: కుక్క మీ బండి మీద మూత్రం పోస్తే దేనికి సంకేతమో తెలుసా?