కాళ్లకు పసుపురాసుకునే సమయంలో ఈ తప్పులు అస్సలే చేయకూడదు?
పసుపు కాళ్లకు రాసుకోవడం అనేది మనం చూస్తుంటాం. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా, దేవుళ్లను చేసుకునేటప్పుడు లేదా గుడికి వెళ్లేటప్పుడు ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు
దిశ, వెబ్‌డెస్క్ : పసుపు కాళ్లకు రాసుకోవడం అనేది మనం చూస్తుంటాం. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా, దేవుళ్లను చేసుకునేటప్పుడు లేదా గుడికి వెళ్లేటప్పుడు ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుంటారు. ముఖ్యంగా పెళ్లైన మహిళలు తమ సౌభాగ్యానికి గుర్తుగా కాళ్లకు పసుపు రాసుకుంటారు. అయితే ఇలా కాళ్లకు పసుపు రాసుకునే సమయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- కొందరు కాళ్లకు పసుపు పెట్టే సమయంలో చేతిలోనే పసుపు కలుపుతారు. అయితే అలా పసుపు రాయడం శుభప్రదం కాదంట. అందువలన గిన్నెలో పసుపు పోసి నీటితో చక్కగా కలుపుకొని పసుపు రాయలంట
- కాళ్లను కింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదంట. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందంటున్నారు.
- కాళ్లకు రాసిన గిన్ననెలో పసుపు పోసి గడపకు రాయకూడదంట.
- అలాగే కాళ్లకు పసుపు రాసే క్రమంలో, రెండు కాళ్లకు ఒకే విధంగా ఎక్కువ, తక్కువ కాకుండా పెట్టుకోవాలంట.
ఇవి కూడా చదవండి: పెంపుడు జంతువుల వల్ల ధూమపానానికి దూరం: తాజా అధ్యయనం