వ్యాధులు రాకూడదంటే.. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ రక్త పరీక్షలు చేసుకోవాల్సిందే!
ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మారుతున్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం వలన అనేక వ్యాధులు మన దరి చేరుతున్నాయి.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మారుతున్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం వలన అనేక వ్యాధులు మన దరి చేరుతున్నాయి.అందువలన వైద్యులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అయితే మనకు తెలియకుండానే మనం కొన్ని వ్యాధుల బారిన పడుతుంటాం. అలాంటి వ్యాధులను మనం ప్రాథమిక దశలోనే గుర్తించాలంట.లేకపోతే అవి ముదిరిపోయాక ఏ ఆస్పత్రులు తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదంట.
అందువల్లనే ఆరోగ్య నిపుణులు,ప్రతీ సంవత్సరం డబ్బు ఖర్చు అనుకోకుండా కొన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోవాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
కంప్లీట్ బ్లడ్ కౌంట్ : ఈ పరీక్ష మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ప్లేట్ లెట్ల సంఖ్య తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఈ పరీక్ష ద్వారా రక్తహీనత, ఇన్ఫెక్షన్,రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నా ఈజీగా తెలుసుకోవచ్చు. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ పరీక్షను తప్పకుండా చేసుకోవాలి.
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ : ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేసే పరీక్ష. ఇది మీ గ్లూకోజ్ స్థాయిలు గత మూడు నెలల్లో ఎలా ఉన్నాయో అంచనా వేసి చెబుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్టు అలాగే, ప్రీ డయాబెటిస్ ఉన్న సంగతిని కూడా ఇది ముందే చూపిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, నరాలు దెబ్బ తినడం వంటివి రాకుండా కాపాడుకోవచ్చు.
థైరాయిడ్ ఫంక్షన్ : ప్రతి సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్షలు చేసుకోవాలి. దీని వలన హైపర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్ ఉన్నదో ఈజీగా తెలుసుకోవచ్చునంట.
CPM పరీక్ష : కాంప్రహెన్సివ్ మెటబాలిక్ పానెల్... దీన్నే CMP అంటారు. వివిధ జీవక్రియ పనులను అంచనా వేయడంతో పాటు, అవయవ పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష ఇది.
లిపిడ్ ప్రొఫైల్ : లిపిడ్ ప్రొఫైల్ అనేది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను చెప్పే పరీక్ష. ఇది గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. ఈ పరీక్ష కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్పడంతో పాటు, లిపో ప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉందో, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది కూడా చెబుతుంది.