విటమిన్ D దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇవే..

విటమిన్ డి ఎముకల పెరుగుదలకు చాలా ముఖ్యం.

Update: 2024-06-04 09:43 GMT

దిశ, ఫీచర్స్: విటమిన్ డి ఎముకల పెరుగుదలకు చాలా ముఖ్యం. అయితే, విటమిన్ డి నీటిలో కరిగే విటమిన్. ఇది హార్మోన్ల పనితీరుకు మద్దతు ఇస్తుంది. విటమిన్లు మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఉదయం సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి మన ఎముకలకు చేరుకొని బలంగా చేస్తాయి. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు కూడా రాలేము. అలాంటి సమయంలో ఆహారంలో వివిధ రకాల గింజలను చేర్చుకోవడం వల్ల శరీరం సహజంగా విటమిన్లు గ్రహిస్తాయి. విటమిన్ డి దొరికే ఆహారాలు గురించి ఇక్కడ చూద్దాం..

బాదం

బాదంలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎముకల బరువును అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

జీడిపప్పు

జీడిపప్పులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ కలిగి ఉండే ఆరోగ్యకరమైన చిరుతిండిగా వీటిని తీసుకోవచ్చు. జీడిపప్పులో మాంగనీస్, ఫాస్పరస్, జింక్ కూడా ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగుపరస్తుంది.

ఖర్జూరం

ఖర్జూరంలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది దీన్ని ఎక్కువగా స్నాక్‌గా తీసుకుంటారు. ఖర్జూరం తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ B6 ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. 


Similar News