గులాబీ నది.. పింక్ ఫ్లవర్స్‌తో ఆకట్టుకుంటున్న టూరిస్ట్ ప్లేస్

దిశ, ఫీచర్స్ : మన దేశంలో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటిలో కేరళ ఒకటి కాగా.. ఆ రాష్ట్రానికి చెందిన కోజికోడ్‌లోని ఓ నది గులాబీమయమై పర్యాటకులకు కనువిందు చేస్తోంది..Latest Telugu News

Update: 2022-06-11 07:51 GMT

దిశ, ఫీచర్స్ : మన దేశంలో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటిలో కేరళ ఒకటి కాగా.. ఆ రాష్ట్రానికి చెందిన కోజికోడ్‌లోని ఓ నది గులాబీమయమై పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పింక్ కలర్‌లో ఉండే 'ఫోర్క్డ్ ఫ్యాన్‌వోర్ట్' పువ్వులు కనుచూపు మేర నిండిపోయి చూస్తున్న ప్రతీ ఒక్కరికి అందమైన అనుభూతిని అందిస్తున్నాయి.

ఇక ఈ అందమైన దృశ్యంపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర కూడా స్పందించారు. 'ఈ గ్రామానికి పర్యటకులు తరలి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఈ ఫొటో నాలో ఉత్సాహాన్ని, ఆశావాద భావాన్ని పెంచుతుంది' అని తెలిపారు. దీంతోపాటు ఈ ఫొటోను నా కొత్త స్క్రీన్ సేవర్‌గా పెట్టుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన.. ఈ ఫొటోకు 'రివర్ ఆఫ్ హూప్'అని పేరు పెట్టుకుంటున్నానని అన్నారు. ఇకపోతే కేరళలో ఉండే ఈ పింక్ నది ఫొటోలు వైరల్ అవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు 2020 నవంబర్‌లో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.


Similar News