ప్రపంచంలోనే అతిపెద్ద నాగలి

మానవ నాగరికతలో నాగలి తెచ్చిన మార్పు ఎంతో గొప్పది.

Update: 2023-05-08 05:42 GMT

దిశ, ఫీచర్స్ : మానవ నాగరికతలో నాగలి తెచ్చిన మార్పు ఎంతో గొప్పది. పొలం చదును చేసి పంటలను సాగు చేయడానికి మానవుడు తొలినాళ్లలో కనిపెట్టిన అద్భుతాల్లో ఇదీ ఒకటి. అయితే కాలానుగుణంగా రాతి నాగళ్లు, కర్ర నాగళ్లు, ఇనుప నాగళ్లుగా మారుతూ వచ్చింది. ప్రస్తుతం ట్రాక్టర్లు, భారీ యంత్రాల సాయంతో నాగళ్లను ఉపయోగిస్తున్నాం. అయితే నాగళ్ల చరిత్రలో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే ‘ఒట్టోమేయర్ ముమ్మట్’. ప్రపంచంలోనే ఇప్పటివరకు తయారు చేయబడిన అతిపెద్ద నాగలి. జర్మన్‌లో ఇసుక మేటలు, గడ్డితో కూడిన బోగ్‌(బాడవనేల)లను వ్యవసాయ భూమిగా మార్చే నిర్దిష్ట ప్రయోజనం కోసం 20వ శతాబ్దంలో దీనిని తయారు చేశారు. దీని ద్వారా భూమిలో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు దున్నవచ్చు.

20వ శతాబ్దం నాటి ఆలోచన

నెదర్లాండ్స్‌తో సరిహద్దులో ఉత్తర జర్మనీలోని ఎమ్స్‌ల్యాండ్ జిల్లాలోని బోగ్ (బాడవనేల) ప్రాంతాలు దాదాపు 1700 సంవత్సరం నుంచి నివాసయోగ్యంగా లేవు. దీంతో 20వ శతాబ్దం మొదట్లో పశ్చిమ జర్మనీ ప్రభుత్వం ఇక్కడ సాగుయోగ్యమైన భూమి లేకపోవడంవల్ల ఆ దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎమ్స్‌ల్యాండ్ వెనుకబడిందనే నిర్ణయానికొచ్చింది. స్థానిక ప్రజలు, దేశం ఆర్థికంగా బలపడాలంటే అక్కడ పనికి రాని బోగ్‌లను సాగుకు పనికి వచ్చే భూమిగా మార్చాల్సిన అవసరం ఉందని భావించింది. ఈ నేపథ్యంలో ఏదైనా టెక్నిక్‌ను కనుగొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. దీంతో వందల ఏళ్లుగా రైతులకు దూరంగా ఉన్న బోగ్‌ ఏరియాలను దున్నేందుకు అవసరమైన ఒక సరికొత్త నాగలిని ఒట్టో మేయర్‌( Otto Meyer) అనే పేరుగల ఇంజనీర్ తన బృందంతో కలిసి తయారు చేశాడు. ఇసుకతో కూడిన మట్టి నుంచి పీట్‌(ఎండి గట్టిపడిన మట్టి)ను బయటకు తీయడానికి డెవలప్ చేశాడు. కాగా మానవ చరిత్రలోనే అతిపెద్ద నాగలి చెప్పబడే దీనికి తయారు చేసిన వ్యక్తి పేరు మీదుగానే Ottomeyer Mammut అనే పేరు స్థిరపడిపోయింది. కష్టతరమైన నేలలో కూడా సాగు చేసేందుకు ఇది దోహదపడింది.

నాగలి ప్రత్యేకతలు

ఒట్టోమేయర్ మమ్ముట్ (German for ‘Mammoth’) ఒక కాంట్రాప్షన్ యొక్క బెహెమోత్(behemoth). దాదాపు 30 టన్నుల బరువు ఉంటుంది. 4 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు కలిగిన మెటల్ వీల్స్, రెండు మీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు భూమిని తవ్వగలిగే జెయింట్ బ్లేడ్స్‌ను కలిగి ఉంటుంది. ఈ నాగలి ముఖ్య ఉద్దేశం పీట్ పైకి తీసుకువచ్చి ఇసుక నేలతో కలిపి మరింత సారవంతం చేయడం. అయితే ఈ నాగలి చాలా పెద్దదేగాక బరువైనది కూడాను. ఉనికిలో ఉన్న ఏ ట్రాక్టర్ దానిని స్వయంగా లాగలేదు. కాబట్టి నాలుగు ట్రాక్షన్ ఇంజిన్‌లతో కూడిన వించ్ వ్యవస్థను రూపొందించారు. ఇంజిన్‌లు ఫీల్డ్‌కు ఇరువైపులా ఉంచబడ్డాయి. వించ్‌లు బలమైన మెటల్ కేబుల్‌ను ఉపయోగించి మమ్ముట్‌ను ఒక వైపు నుంచి మరొక వైపుకు లాగుతాయి.

సాగుభూమిగా మారిందిలా?

1950ల మధ్యకాలంలో మొత్తం 12 ఒట్టోమేయర్ మమ్ముట్ నాగళ్లను తయారు చేశారు. దాదాపు 12 సంవత్సరాల వ్యవధిలో వాయువ్య జర్మనీలో(North-Western Germany) సుమారు 17,000 హెక్టార్ల బోగ్‌లను సాగు యోగ్యమైన వ్యవసాయ భూమిగా మార్చడానికి వాటిని ఉపయోగించారు. వారు ఎమ్స్‌ల్యాండ్‌లోని 5 కౌంటీలను రోజుకు 12 గంటలు, వారానికి 6 రోజులు, ఈస్టర్ నుంచి అక్టోబర్ వరకు దున్నుతారు. అప్పట్లో నివాసయోగ్యం కాని భూమి, నేడు అత్యంత సారవంతమైన వ్యవసాయ భూమిగా మారింది. 1970లలో బోగ్‌ల మార్పిడి పూర్తయిన తర్వాత ఒట్టోమేయర్ భారీ యంత్రాల అవసరం లేకుండా పోయింది. సాధారణ ట్రాక్టర్లను యూజ్ చేస్తున్నారు. కాబట్టి అప్పటి ఒట్టోమేయర్ ముమ్మట్ ప్రస్తుతం ఎమ్స్‌ల్యాండ్ మూర్‌ మ్యూజియంలో ఒక చారిత్రక చిహ్నంగా ఆకట్టుకుంటోంది. 

Read More:    వేసవిలో దొరికే బీరకాయ తినడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! 

Tags:    

Similar News