ఉదయాన్నే లేచి ఆ పనిచేసే అలవాటు.. బెనిఫిట్స్ తెలిస్తే మీరు కూడా..

ఉరుకులు, పరుగుల జీవితంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచే అలవాటు ఈ రోజుల్లో చాలా తక్కువ మందికే ఉంటోంది. కానీ దీనివల్ల మనం ఆరోగ్యపరంగా నష్టపోతామని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-07-06 12:15 GMT

దిశ, ఫీచర్స్ : ఉరుకులు, పరుగుల జీవితంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచే అలవాటు ఈ రోజుల్లో చాలా తక్కువ మందికే ఉంటోంది. కానీ దీనివల్ల మనం ఆరోగ్యపరంగా నష్టపోతామని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఆలస్యంగా మేల్కోవడం మానసిక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాకపోతే నైట్ షిఫ్టులు చేసేవారికి ఇది వర్తించదని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. రాత్రిళ్లు త్వరగా పడుకొని ఉదయం లేటుగా లేస్తేనే బద్ధకం ఆవహించే అవకాశం ఉందట. ఇక లేటుగా లేటుగా నిద్రలేచే వారితో పోల్చితే పొద్దున్న 5 గంటలలోపు మేల్కొని దిన చర్యలు ప్రారంభించేవారు మెంటల్లీ, ఫిజికల్లీ యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. అదెలాగో చూద్దాం.

* డైలీ అర్లీ మార్నింగ్ 5 గంటలకే నిద్ర మేల్కొనే అలవాటు కలిగిన వారిలో ఆరోగ్యంతోపాటు పర్సనల్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పెద్దలు అయితే వ్యాయామం చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఇక పిల్లలైతే హోం వర్క్ చేయడం, చదవడం, ఆడుకోవడం వంటివి చేయవచ్చు. పొద్దున్నే చదివితే బాగా గుర్తుంటాయని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా పెద్దలు చెప్తుంటారు.

* లేటుగా నిద్రలేస్తే పనులన్నీ ఆలస్యం అవుతాయి. అదే సూర్యోదయానికి ముందు లేస్తే.. చకచకా అయిపోతాయి. 8 గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ కూడా తినొచ్చు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సమయానికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి రాత్రిపూట త్వరగా నిద్రపోయి, మార్నింగ్ కూడా త్వరగా మేల్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా లేవడం అలవాటు లేనివారికి మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. కానీ అలాగే లేస్తూ ఉంటే క్రమంగా అలవాటు అవుతుంది. దీంతో ఇంటి పనులు, వ్యాయామాలు, ప్రణాళికలు అన్నీ సక్రమంగా, సమయానుసారంగా జరుగుతాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యం కూడా బాగుటుంది.

* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News