ఘోరం.. భార్య మీద కోపంతో కూతురిని రేప్ చేసిన తండ్రి.. గర్భవతి కావడంతో
ప్రస్తుత కాలంలో అన్న, తమ్ముడు, తండ్రి అని తేడా లేకుండా అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో అన్న, తమ్ముడు, తండ్రి అని తేడా లేకుండా అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాటేస్తున్నారు. కూతురికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ చేయూత అందించాల్సిన కన్న తండ్రే కూతురి జీవితాన్ని కష్టాల కడలిలోకి నెట్టేశాడు. అసలు వాడిని తండ్రి అని అనడం కన్నా కామ పిశాచి అని పిలవడం మిన్నా..
అసలు విషయంలోకి వెళితే.. మైనర్ కూతురిపై తండ్రి పదేపదే అత్యాచారం చేసిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం బాధితురాలు ముంబాయిలో ఆమె తండ్రి, అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటున్నది. అయితే ఇటీవల ఎక్కువగా కడుపునొప్పితో బాధపడుతోందని బాధితురాలిని బాంద్రాలోని బాబా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి ఆమెను పరీక్షించగా గర్భవతి అని తేలింది. మైనర్ అమ్మాయి గర్భవతి అని తెలుసుకున్న వైద్యులు వెంటనే బాంద్రా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఎలా గర్భవతి అయ్యావు, నిన్ను ఎవరు మోసం చేశారు అని పోలీసులు ఆ అమ్మాయిని ఆరా తీయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
తన తండ్రే తనపై పదేపదే అత్యాచారం చేశాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక వెల్లడించింది. అమ్మాయి ఇచ్చిన సమాచారంతో షాక్ అయిన పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేశారు. కాగా బాలిక తండ్రి గతంలో దొంగతనం, అత్యాచారం కేసుల్లో అరెస్టు అయి జైలుకు వెళ్లాడని, అతనికి గతంలో నేరచరిత్ర ఉందని ముంబాయి పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు.
జైలు జీవితం గడిపిన అమ్మాయి తండ్రి 2023 నవంబర్లో జైలు నుంచి విడుదలయ్యాడని, అప్పటి నుంచి ప్రతిరోజూ కూతురిపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసు అధికారి తెలిపారు. అతని నేర ప్రవృత్తి కారణంగా అతని భార్య అతనితో ఉండకుండా.. కూతురిని అమ్మమ్మ దగ్గర వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో మైనర్ బాలిక, నిందితుడి తల్లి మాత్రమే నివసిస్తున్నట్లు సమాచారం.