Tea lovers be alert: టీ ప్రియులకు హెచ్చరిక.. ఈసారి మాత్రం మానుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం: FSSAI

టీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వర్షాకాలంలో ఛాయ రుచి మరింత పెరిగిపోతుంది.

Update: 2024-07-30 04:33 GMT

దిశ, ఫీచర్స్: టీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వర్షాకాలంలో ఛాయ రుచి మరింత పెరిగిపోతుంది. వర్షం పడినప్పుడల్లా కొంతమంది ఒక రోజులోనే కప్పుల కొద్ది టీ తాగుతూ ఉంటారు. టీ తాగితే మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అందులో ఇంకా బ్లాక్ టీ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. బ్లాక్ టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పలు క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, వర్క్‌పై ఫోకస్ చేస్తారు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఇలా బ్లాక్ టీ వల్ల అనేక ఉపయోగాలున్నాయి.

అయితే తాజాగా FSSAI (Food Safety and Standards Authority of India) టీ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. బయట హోళ్లలో టీ తాగొద్దని హెచ్చరించింది. టీ తయారు చేసే ఆకులను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటిల పెద్ద మొత్తంలో పురుగు మందులను, కెమికల్ కలర్స్ ను వాడుతున్నట్లుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా గుర్తించింది. రొడమైన్ బి, కార్మిసిన్ వంటి ఫుడ్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ఈ కలర్స్ మోస్ట్ పాజిజనెస్ట్‌గా శాస్త్రవేత్తలు వివరిస్తారు. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ వాడడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని FSSAI వెల్లడించింది.

విపరీతంగా క్రిమి సంహారక మందులను టీ పౌడర్‌లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలాంటి వారిపైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ల్యాబ్ లలో ముప్పై ఐదు నుంచి నలబై వరకు ఎక్కువగా కెమికల్ కంపౌండ్స్ వాడుతున్నట్లుగా గుర్తంచామని,అవసరాన్ని మించి ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఇలాంటి వారిపైన చర్యలు తప్పవని సంబంధిత అధికారిత వర్గం తెలిపింది. కాగా టీ ప్రియులు ఇలాంటి విషయాల్ని గుర్తించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని సూచించింది.

Tags:    

Similar News