'సన్ చార్జ్‌డ్ వాటర్'.. ఏంటి స్పెషల్!
దిశ, ఫీచర్స్ : సూర్యభగవానుడిని భారతీయులు వేదకాలం నుంచి ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు భానుడి నుంచి ప్రసారమయ్యే వేడి.. వివిధ రుగ్మతలు, శారీరక సంక్షోభాల నుంచి బయటపడేయగలదు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సూర్యభగవానుడిని భారతీయులు వేదకాలం నుంచి ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు భానుడి నుంచి ప్రసారమయ్యే వేడి.. వివిధ రుగ్మతలు, శారీరక సంక్షోభాల నుంచి బయటపడేయగలదు. ప్రత్యేకంగా సన్ లైట్ నుంచి వెలువడే 'విటమిన్ డి' శరీరాన్ని అంతర్గతంగా బలపరుస్తుంది. అదేవిధంగా 'సూర్య జల్' కూడా వివిధ రకాల శారీరక సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేదం చెప్తోంది. ఇంతకీ సన్ వాటర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈ నీటిని ఎలా తయారుచేసుకోవాలి?
సూర్యుని వేడికి నిజంగానే వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. పురాతన కాలంలో భానుడి ఎండ వల్ల వేడెక్కిన నీటిని పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగించేవారు. ఈ నీటిని తయారుచేసుకోవాలంటే.. ఒక కంటైనర్‌ను నీటితో నింపి కనీసం 8 గంటల పాటు ఎండలో ఉంచాలి. అప్పుడే నీరు సూర్య శక్తిని పూర్తిగా గ్రహించగలదు. ఇదే క్రమంలో వరుసగా 3 రోజులు 6 గంటల పాటు ఒక కుండలో నీటిని ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఈ నీటిని తాగితే రకరకాల శారీరక సమస్యలు దూరమవుతాయి.
ఉపయోగాలు :
వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో పోరాడే శక్తి సూర్యునికి ఉంది. అదనంగా ఎముకల నొప్పి, జీర్ణ సమస్యలు, అలెర్జీల విషయంలోనూ సన్ వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండగా ఉన్న రోజుల్లో చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. అలాంటప్పుడు సన్ వాటర్ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇక రోజంతా పని ఒత్తిడితో అలసిపోయినట్లుగా అనిపించినప్పుడు సన్ వాటర్ ఎనర్జీ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. మొటిమలు, దద్దుర్లు నివారణకు గాను ఈ సూర్యుని నీటితో ముఖాన్ని కడగవచ్చు.