గొంతు నొప్పి తీవ్రంగా వేధిస్తోందా?.. ఉపశమనం కోసం ఇలా చేయండి !
గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తుతోందా? అయితే అది టాన్సిల్స్ వల్ల కూడా కావచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
దిశ, ఫీచర్స్ : గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తుతోందా? అయితే అది టాన్సిల్స్ వల్ల కూడా కావచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామందిలో సాధారణ గొంతు నొప్పితోపాటు టాన్సిల్స్ (గడ్డలు) ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు దీనివల్ల అవస్థలు పడుతున్నారు. ఇంతకీ టాన్సిల్స్ ఎందుకు వస్తాయి? సింప్టమ్స్ ఏమిటి? ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.
టాన్సిల్స్ సమస్యను టాన్సిలిటిస్ అని కూడా అంటారు. ఈ ప్రాబ్లంవల్ల గొంతు నొప్పితోపాటు జ్వరం, మెడ నొప్పి, మెడలో శోషరస గ్రంథులు విస్తరించడం, కడుపు, చెవులు, తలలో నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి టాన్సిల్స్ తెల్ల రక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి బాధితుల నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేస్తాయి. టాన్సిలిటిస్ వల్ల అవి పనిచేయవు. ఈ క్రమంలోనే సాధారణ జలుబు, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వంటివి కూడా టాన్సిలిటిస్‌ను ప్రేరేపిస్తాయి. ఇక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియావల్ల తలెత్తుతుంటాయి. క్రమంగా టాన్సిలిటిస్‌ను ప్రేరేపిస్తాయి. దీంతోపాటు చేతులు శుభ్రంగా కడగకుండా ఆహార పదార్థాలు తినడం, తుమ్ములు లేదా దగ్గు తర్వాత చేతులు కడగకుండా నోటిని, కళ్లను తాకడం, ఆహార పదార్థాలు తినడం టాన్సిలిటిస్ రావడానికి దోహదం చేస్తాయి. అలాగే టూత్ బ్రష్‌లను డస్ట్ పడే ప్రదేశంలో ఉంచిన తర్వాత నీటితో కడగకుండా వాడటంవల్ల కూడా టాన్సిలిటిస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇప్పటికే గొంతు నొప్పి, జలుబు, టాన్సిలిటిస్ వల్ల ఇబ్బంది పడుతున్నవారు బ్రెష్ చేసిన తర్వాత టూత్ బ్రష్‌లను మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తినే ఆహారం, పానీయాలు షేర్ చేసుకోవడం మంచిది కాదు.
పరిష్కారమేంటి?
టాన్సిలిటిస్‌తో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పును కలుపుకొని నోటితో పుక్కిలించండి. గొంతు నొప్పిని, వాపును, టాన్సిలిటిస్ వల్ల కలిగే ఇతర సమస్యలను తగ్గించడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే టాన్సిటిస్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి టీ లేదా కాఫీ వంటి హాట్ డ్రింక్స్ తాగవచ్చు. అవసరం అయితే గొంతు నొప్పిగా ఉన్న భాగంలో ఐస్ క్యూబ్స్ కూడా పెట్టవచ్చు పెట్టవచ్చు. ఇవి చల్లగా ఉన్నప్పటికీ నొప్పిని, వాపును తగ్గిస్తాయి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రాన్సిలిటిస్ అనేది ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్ లేదా బాక్టీరియా వల్ల కలుగుతుంది. సాధారణ జలుబు దానంతట అదే తగ్గినట్లు ఇది కూడా తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే మాత్రం తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.