హైపర్ పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారా?.. నిమిషంలో తగ్గించే బెస్ట్ ఇంటి చిట్కాలు ఇవే
ఏదైనా సమస్య కారణంగా డాక్టర్ దగ్గరకు వెళితే జేబులు ఖాళీ కావాల్సిందే. వాళ్ళు రాసే ఖరీదైన మరియు కఠినమైన కెమికల్స్ ఉండే మందులు వాడిన కొన్ని సార్లు రిజల్ట్ కూడా అనుకున్న రీతిలో రాదు.
దిశ, ఫీచర్స్: ఏదైనా సమస్య కారణంగా డాక్టర్ దగ్గరకు వెళితే జేబులు ఖాళీ కావాల్సిందే. వాళ్ళు రాసే ఖరీదైన మరియు కఠినమైన కెమికల్స్ ఉండే మందులు వాడిన కొన్ని సార్లు రిజల్ట్ కూడా అనుకున్న రీతిలో రాదు. ఇప్పుడు నేను చెప్పే ఇంటి చిట్కాలతో మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, హైపర్ పిగ్మెంటేషన్‌ను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఈ సహజ ఉత్పత్తులు చాలా వరకు మీకు మీ వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఇంట్లో లేకపోయినా సులభంగా మార్కెట్ లో దొరుకుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. బంగాళదుంప:
హైపర్ పిగ్మెంటేషన్ వలన వచ్చే టాన్, నల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది.
కావలసినవి
బంగాళదుంప సగం ముక్క ( చీలికలుగా కోయాలి)
చేసే విధానం
* బంగాళదుంప ముక్కను సన్నని ముక్కలుగా కోసి, ఎక్కడ అయితే పిగ్‌మెంటేషన్ ఉందో అక్కడ సున్నితంగా రబ్ చేయాలి. అలా చేసిన 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
2. తేనె మరియు నిమ్మకాయ రసం:
తేనెలో తేమ గుణాలు ఉంటే నిమ్మకాయ సహజ బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.( నిమ్మరసంలో నీటిని కలపాలి. ఎందుకంటే నిమ్మలో ఉండే ఆమ్లం చర్మానికి ఇరిటేషన్‌ను కలిగిస్తుంది)హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఒక సులభమైన పద్ధతి గురించి తెలుసుకుందాం.
కావలసినవి
నిమ్మ రసం – 2 స్పూన్స్
తేనే – 2 స్పూన్స్
చేసే విధానం
ఒక బౌల్ లో నిమ్మరసం,తేనే తీసుకుని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక నెల పాటు ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
3. విటమిన్ E మరియు కలబంద రసం:
కలబంద, విటమిన్ E పిగ్మెంటేషన్ కి బాగా పనిచేస్తుంది. ఇది చర్మంలో మృతకణాలను తొలగించి కొత్త చర్మ కణాలు పునరుత్పత్తికి సహాయపడుతుంది.
కావలసినవి
కలబంద రసం
విటమిన్ E క్యాప్సిల్ లేదా విటమిన్ E ఆయిల్
చేసే విధానం
కలబంద గుజ్జులో కొన్ని చుక్కల విటమిన్ E ఆయిల్ ని కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
4. తేనె మరియు పాలు:
ఈ ప్యాక్ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఒక సులభమైన మార్గం.
కావలసినవి
పాలు – 2 స్పూన్స్
తేనే – 1 స్పూన్
చేసే విధానం
ఒక బౌల్ లో పాలు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
5. దోసకాయ రసం:
దోసకాయ రసం కూడా హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది.
కావలసినవి
దోసకాయ సగం ముక్క (రసం తీసుకోవాలి)
చేసే విధానం
దోసకాయ రసాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.