చేతులు శుభ్రం చేసుకోవడం.. అతీత శక్తుల పనేనా?
మీరు జుంబా (డ్యాన్స్) క్లాస్‌కి వెళ్లడం లేదా ప్రతీరోజు ఉదయం జిమ్‌కి వెళ్లడం మొదట్లో ఒక పనిలా అనిపించవచ్చు.
దిశ, ఫీచర్స్: మీరు జుంబా (డ్యాన్స్) క్లాస్‌కి వెళ్లడం లేదా ప్రతీరోజు ఉదయం జిమ్‌కి వెళ్లడం మొదట్లో ఒక పనిలా అనిపించవచ్చు. వాటిని అలవాటు చేసుకోవడం అంత ఈజీ అనిపించకపోవచ్చు. కానీ కొంతకాలం అలాగే వెళ్తూ ఉంటే.. క్రమంగా అలవాటు అవుతుంది. అయితే ఒక పనిని ఇలా అలవాటు చేసుకోవడానికి లక్కీ నెంబర్లు, మ్యాజిక్ నెంబర్లు, అదృష్టాలు పనిచేస్తాయని కొందరు అంటుంటారు. కానీ ఇటువంటి అంచనాలు కరెక్టు కావని కాల్టెక్‌లోని సోషల్ సైంటిస్టులు ఒక కొత్త అధ్యయనం ద్వారా నిరూపించారు.
జిమ్‌కు వెళ్లడం అనే హాబీ లేదా అలవాటు ఏర్పడటానికి సగటున 6 నెలల సమయం పడుతుందట. అలాగే ఇక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆస్పత్రుల్లో పేషెంట్లను పరిశీలించిన తర్వాత, లేదా సర్జరీల అనంతరం చేతులు కడుక్కోక్కునే అలవాటు చేసుకోవడానికి సగటున కొన్ని వారాలు పడుతుందని అధ్యయనం పేర్కొన్నది. అంతేగానీ ఇక్కడ మ్యాజిక్ నెంబర్ పని చేయదని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో పబ్లిషైన ఒక స్టడీ స్పష్టం చేసింది.
‘‘ఒక పని మనకు అలవాటు పడటానికి దాదాపు 21 రోజులు పడుతుందని కొందరు అనడం మీరు విని ఉండవచ్చు. కానీ ఈ అంచనా సైన్స్‌పై ఆధారపడింది కాదు’’ అని కాల్టెక్‌కు చెందిన అధ్యయన కర్త కోలిన్ కెమెరార్ తెలిపాడు. వర్క్ సపోర్టు, ఐడియా, ప్రవర్తన, అక్కడి వాతావణం, పరిస్థితుల ప్రభావం ఇలా అనేక ఇతర కారణాలను బట్టి ఒక హాబీ ఏర్పడే వేగం, విధానం భిన్నంగా ఉంటుందని అతను పేర్కొన్నాడు.
‘మెషిన్ లెర్నింగ్’లో తేలిందేమిటి?
అలవాటు లేదా హాబీ ఏర్పడటాన్ని స్టడీ చేసేందుకు పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను ఉపయోగించారు. జిమ్ సెంటర్లలో వర్కవుట్స్ చేసేందుకు, అలాగే హాస్పిటల్ షిఫ్ట్‌ల సమయంలో చేతులు కడుక్కోవడానికి ఎలా అలవాటు పడ్డారో తెలుసుకోవడానికి తమ బ్యాడ్జ్‌లను స్వైప్ చేస్తున్న 10 వేలమంది వ్యక్తులకు సంబంధించిన పెద్ద డేటా సెట్‌లను విశ్లేషించడానికి సైంటిస్టులు ‘మెషిన్ లెర్నింగ్’ విధానాన్ని ఉపయోగించారు.
అధ్యయనంలో భాగంగా నాలుగేళ్లలో 30 వేల మందికిపైగా జిమ్‌గోయర్స్‌ను(gymgoers), దాదాపు 3 వేలమంది హాస్పిటల్ ఎంప్లాయీస్‌ను ట్రాక్ చేశారు. ఫైనల్‌గా తేలిందేమిటంటే.. ఒక అలవాటు వెనుక ఎటువంటి అతీత శక్తి, మ్యాజిక్ నెంబర్ పనిచేయదు. వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
గుమ్మడికాయ తింటే.. ఇన్ని రకాల జబ్బులు మాయమా? అవి ఏంటో తెలుసా?