Ganesh Chaturthi: విద్యార్థులు గణపయ్య నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు..

వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే.

Update: 2024-09-06 11:54 GMT

దిశ, ఫీచర్స్ : వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే. గణేష్ మండపాలు, చందా, నిమజ్జనం.. ఇలా ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు. తొమ్మిది రోజులు భజనలు చేస్తూ కొలుచుకునే భక్తులు.. నిమజ్జనం రోజు డ్యాన్సులతో గణపయ్యను సాగనంపుతూ కన్నీరు పెట్టుకుంటారు కూడా. అయితే గణేషుడి నుంచి విద్యార్థులు ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? ఆయన స్టోరీ ఎంతగా మోటివేట్ చేయగలదు? తెలుసుకుందాం.

జ్ఞానం, తెలివి

గణేషుడు జ్ఞానం, తెలివి కోసం ఆరాధించే దేవుడిగా పరిగణించబడుతాడు. ఆయన కథలోనూ ఇదే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నాలెడ్జ్, ఇంట్రెస్ట్, ఓపెన్ మైండ్ తో ఎలా ఉండలో గణపయ్య నుంచి నేర్చుకోవచ్చు.

పట్టుదల

వినాయకుడి కథ పట్టుదల, సంకల్పం విలువను బోధిస్తుంది. విద్యార్థులు ఓర్పుతో అడ్డంకులు అధిగమించడం నేర్చుకోవాలి.

వినయం

గణేషుడు చాలా జ్ఞానవంతుడు అయినప్పటికీ.. వినయానికి ప్రసిద్ధి చెందాడు. కాబట్టి వినమ్రతతో ఉండటం వల్ల పెద్దల మన్ననలు పొందగలరు. దీనివల్ల నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే మార్గాలు కూడా ఉంటాయి.

అనుకూలత

తన సృజనాత్మక శక్తితో సమస్యలను ఇట్టే పరిష్కరించగల గణపతి దేవుడి నుంచి క్రియేటివ్ పవర్ గురించి నేర్చుకోవాల్సి ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం, అప్ డేట్ అవుతుండటం మంచిది.

ఫోకస్, కాన్సంట్రేషన్

గణేషుడిని తరుచుగా భారీ తలతో చిత్రీకరిస్తారు. ఇది పెద్దగా ఆలోచించడం, దృషి కేంద్రికరించడానికి సంకేతం. కాబట్టి విద్యార్థులు ఏకాగ్రత ప్రాముఖ్యత, లక్ష్యాలను సాధించేందుకు ఫోకస్ ఎంత అవసరం అనేది తెలుసుకోవాలి.

గౌరవం

గణేషుడు తన తల్లిదండ్రులు శివపార్వతుల తోపాటు పెద్దలపై అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నాడు. అలాగే విద్యార్థులు కూడా తమ లెర్నింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్న పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉపాధ్యాయులు, మార్గ నిర్దేశకులను గౌరవించాలి.

Tags:    

Similar News