ఒంటరి వేళల్లో సంభవించే కొన్ని ఆపదలు.. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య వచ్చిపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా బయపడాలంటే..
దిశ, ఫీచర్స్: పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య వచ్చిపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయంతో బయటపడుతుంటాం. కానీ ఆ క్షణం ఎవరూ లేకపోతే.. ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోని ఆపదలు వస్తే?.. అలాంటి పరిస్థితి నుంచి బయపడాలంటే మీకు కొన్ని విషయాలపట్ల అవగాహన అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో రక్షించుకునేందుకు ఉపయోగపడే ప్రాథమిక అవగాహన చిట్కాలు, చికిత్సా మార్గాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
ఆహారం గొంతులో ఇరుక్కున్నప్పుడు
ఇంట్లో మీరు ఒంటరిగానే ఉన్నారు. బయటకు వెళ్దామనో, ఆకలి వేసినందువల్లో అప్పుడే తినడానికి కూర్చున్నారు. ఆహారం నోట్లో పెట్టుకోగానే సడెన్‌గా ‘స్వరం పడుతుంది’ అంటే గొంతులో ఇరుక్కుపోతుంది. సమస్య చిన్నదే అనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో ఏమాత్రం తేడాలొచ్చినా ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా చికెన్, మటన్ ముక్కలు లేదా కూరగాయ ముక్కలు ఇరుక్కుపోతుంటాయి. అవి లోపలిక లేదా బయటకు రాకపోతే ఊపిరాడని పరిస్థితి ఏర్పడి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. ఆ పరిస్థితివల్ల మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందకుండా పోతుంది. వెంటనే ప్రైమరీ ఎయిడ్ అవసరం. కానీ మీరు ఒంటరిగా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. చేతిని పిడికిలిగా బిగించండి. మీ నాభికి కొద్దిగా పైన భాగాన ఉంచి మరొక చేత్తో దానిని పట్టుకొని కౌంటర్ టాప్ పొజిషన్‌లో లేదా కుర్చీపై ఆని కాస్త ముందుకు వంగండి. ఇరుక్కుపోయిన ఆహారాన్ని బయటకు కదిలేలా మీ పిడికిలితో నొక్కుతూ ఉండండి. ఇక ఈ సమస్య నుంచి బయట పడేందుకు మరొక మెథడ్ ఏంటంటే.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు మీ చేతితో గట్టిగా పిడికిలి బిగించి పొట్టపై పక్కటెముకల కింది భాగంలో కానీ, మీ పొత్తి కడుపుపైన కానీ నొక్కండి. ఇరుక్కు పోయిన ఆహారం లేదా మాంసపు ముక్క భాగాన్ని తొలగించేందుకు ఇది సహాయపడవచ్చు. ఇక గర్భిణులు ఒంటరిగా ఉన్నప్పుడు గనుక అలా జరిగితే మరింత జాగ్రత్త అవసరం. వెంటనే మీ చేతులను సాధారణంకంటే ఎత్తుగా, రొమ్ము ఎముక కింద ఉంచాలి. మరొక ప్రత్యామ్నాయం ఏంటంటే దగ్గుతున్నప్పుడు మీ వీపును గోడకు ఆనించి ఉంచండి.
వంట చేస్తుండగా విద్యుత్ లేదా ఆయిల్ ఫైర్
కొన్నిసార్లు స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ మంటలు లేదా ఆయిల్ వల్ల మంటలు సంభవించవచ్చు. అలాంటప్పుడు వాటిని ఆర్పడానికి నీటిని ఉపయోగించడం సేఫ్ కాదు. కొందర మంటను ఆర్పేందుకని మంటలు అంటుకున్న గిన్నెను స్టవ్ మీద నుంచి కిందికి దించే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయకండి. దానిని ఉన్నచోటనే వదిలివేయండి. అదలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఒక మెటల్ మూతతో మంటను కప్పి ఉంచండి. కానీ సిరామిక్‌ను మాత్రం ఉపయోగించకండి. అలాగే చిన్న మంటలను ఆర్పడానికి బేకింగ్ సోడా లేదా ఉప్పును కూడా ఉపయోగించవచ్చు. కానీ బేకింగ్ పౌడర్ మాత్రం ఉపయోగించవద్దు. అలాగే వంట చేస్తున్నప్పుడు సంభవించే విద్యుత్ మంటలను లేదా ఆయిల్ మంటలను ఆర్పడానికి నీరు, టవల్ లేదా ఏదైనా ఇతర బట్టలతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించవద్దు. మీ వద్ద అగ్నిపమాక పరికరం ఉంటే దానిని ఉపయోగించడం బెటర్.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు
మీరు గుండెపోటుకు సంబంధించి ఏవైనా లక్షణాలను గుర్తిస్తే లేదా మీరు దానిని అనుభవిస్తున్నారనే అనుమానం వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పనిని వెంటనే ఆపివేసినట్ల నిర్ధారించుకోండి. ఆ తర్వాత ముందుగా ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేయండి. అటు పిమ్మట స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఫోన్ చేయండి. అయితే హార్ట్ ఎటాక్ వస్తున్న అనుమానం ఉన్నప్పుడు లేచి నిలబడకండి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పర్చడానికి మీ మోకాళ్లను పైకి ముడిచి కూర్చోండి. అలాగే డీప్ బ్రీత్ తీసుకోండి.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మీరు ఒంటరిగా ఉంటే తప్పించుకునే మార్గాలను వెతకండి. అలాగే మీరు అక్కడి చిక్కుకుని ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే శ్వాసకోశ ఇరిటేటింగ్, శ్వాస ఆడకపోవడం వంటివి సంభవించవచ్చు. ఉబ్బసం, గుండె జబ్బులు వంటివైద్య పరిస్థితులను కూడా ఇది తీవ్రతరం చేస్తుంది. అందుకోసం మీరు తప్పించుకునే క్రమంలోనే పొగ పీల్చకుండా జాగ్రత్త పడాలి. అంటే నోటికి దుస్తులు లేదా టిష్యూ వంటివి కాస్త అడ్డుగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ బట్టకు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నేలపై పడుకొని దొర్లండి.
కత్తి గాయాలు అయినప్పుడు
కూరగాయలు, పండ్లు కట్ చేసే క్రమంలో కొన్నిసార్లు అనుకోకుండా కత్తిని గట్టి ఉపయోగించడంవల్ల గాయం ఏర్పడుతుంది. వెంటనే రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెంటనే రక్త స్రావం ఆపాలి. అందుకోసం మీ వద్ద పరిశుభ్రమైన బట్ట ఉంటే గాయం చుట్టూ కట్టు కట్టండి. ఆ తర్వాత గాయంలో పెద్ద వస్తువు ఏదైనా ఎంబెడ్ చేయబడి ఉంటే దానిని మీరే తీయకండి. రక్త స్రావం ఎక్కువగా అయి మీరు నియంత్రించలేని పరిస్థితిలో ఉంటే వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి.
కారు నడుపుతున్నప్పుడు..
మీరు కారు నడుపుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని గ్రహించగానే రెండు చేతులను స్టీరింగ్ వీల్‌పై 10 లేదా 2 క్లాక్ పొజిషన్‌లో (10 and 2 o'clock position) ఉంచండి. ఇక స్టీరింగ్ వీల్‌ను నిరోధించవద్దు. మీ కారు దేనికైనా తగిలినా దాని ప్రభావం ఎయిర్ బ్యాగ్ సిస్టంను ప్రేరేపిస్తుంది. కాబట్టి స్టీరింగ్ వీల్‌ను నిరోధించవద్దు. ఎందుకంటే అది తీవ్రమైన గాయానికి కారణం కావచ్చు. అదే సందర్భంలో మీరు నార్మల్ డ్రైవింగ్ పొజిషన్‌లో ఉండాలి. ఈ స్థితిలో మిమ్మల్ని మీరు రక్షించడానికి వెహికల్ సేఫ్టీ సిస్టమ్స్ రూపొందించబడినందున హన్సింగ్ లేదా డకింగ్‌ను నివారించండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని మీరు రక్షించుకోలేని పరిస్థితి ఎదురైతే వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు, ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు కాల్ చేయండి.