Trendy Information Hub.. ఫ్యూచర్ అంతా సోషల్ మీడియాదే !
అలస్కా ఎయిర్ లైన్‌కు చెందిన ఒక విమానం 174 మందితో బయలు దేరింది. అది సరిగ్గా అమెరికాలోగల ఒరెగాన్‌లోని పోర్ట్ ల్యాండ్‌కు చేరగానే ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
దిశ, ఫీచర్స్ : జనవరి 6, 2024. అలస్కా ఎయిర్ లైన్‌కు చెందిన ఒక విమానం 174 మందితో బయలు దేరింది. అది సరిగ్గా అమెరికాలోగల ఒరెగాన్‌లోని పోర్ట్ ల్యాండ్‌కు చేరగానే ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. కారణం జర్నీలో ఉండగా ఎగ్జిట్ డోర్ ఊడిపోయిందట. ఈ ఇన్ఫర్మేషన్ క్షణాల్లో వైరల్ అయింది. అంతేకాదు మొన్నటికి మొన్న జపాన్‌లో భూకంపం సంభవిస్తే.. ఆ వార్త క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇటీవల ఒక కొత్త సినిమా తీయాలని మేకర్స్ డిసైడ్ అయితే.. షూటింగ్ ప్రారంభించకముందే అసలు విషయాలన్నీ లీక్ అయ్యాయి. గతేడాది ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై పరిశోధనలకోసం అంతరిక్షంలోకి పంపిన ఆదిత్య ఎల్ 1 జనవరి 6న లగ్రాంజ్ కక్ష్యలోకి ఎంట్రీ ఇస్తుందనే విషయం కూడా ఒకటి రెండు రోజుల ముందే అందరికీ తెలిసిపోయింది. కారణం.. ఓన్లీ సోషల్ మీడయా!
వరల్డ్‌వైడ్‌గా జరిగే సంఘటనలు, సంచలనాలు, సెలబ్రిటీల పర్సనల్ విషయాలు, ప్రముఖల సోషల్ లైఫ్, నూతన ఆవిష్కరణలు, సామాజిక పోకడలు, నయాట్రెండ్స్ విషయాలు ఏవైనా కానీ క్షణాల్లో తెలిసిపోతుంటాయి. ఇదంతా ఎలా సాధ్యం?.. నో డౌట్! అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటున్నారు నిపుణులు. ప్రజెంట్ మరుసటి రోజు వచ్చే న్యూస్ పేపర్స్, టీవీ ఛానళ్లకంటే కూడా అత్యంత వేగంగా సమాచారమంతా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తోంది. అందుకే కాలాజ్ఞానం తెలిసిన పెద్దలు, నిపుణులు భవిష్యత్ సమాచార వ్యవస్థ అంతా సోషల్ మీడియాను ఆశ్రయించక తప్పదని చెప్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియానే ప్రధాన సమాచార వారధిగా వ్యవహారాలు కొనసాగిస్తున్న సంస్థలు, వ్యక్తులు రోజురోజుకు పెరుగుతుండటం తెలిసిన విషయమే.
జస్ట్ వన్ క్లిక్
మీరు వాకింగ్ చేస్తుంటారు. వెంటనే ఒక కొత్త ఆలోచన తడుతుంది. ఎవరితోనో షేర్ చేసుకోవాలనుకుంటారు. వెంటనే ఏం చేస్తారు? ప్రజెంట్ అయితే చాలామంది చేస్తున్న ఏంటో తెలుసా? తమ ఆలోచనను, అభిప్రాయాన్ని వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్, థ్రెడ్, టెలిగ్రామ్‌లతోపాటు వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసేస్తున్నారు. దీంతో ఆ సమాచారం క్షణాల్లో కోట్లాది మందికి చేరువవుతోంది. అందుకే సోషల్ మీడియా ఇప్పుడు పవర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వెపన్‌గా మారిందని చెప్పడంలో ఎవరికీ ఎటువంటి సందేహలూ ఉండట్లేదు. మీరు చూసిందిగానీ, చదివిందిగానీ, ఒక సబ్జెక్ట్ పట్ల, సంఘటన పట్ల మీ ఓపీనియన్ గానీ వెంటనే పంచుకోవాలంటే గంటలు, రోజుల తరబడి జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరితో చెప్పుకోవాలా? అని వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఏ సోషల్ సైట్‌లోనో పోస్ట్ చేసేస్తే అందరూ చూస్తారు. నచ్చితే అభినందిస్తారు. నచ్చపోతే విమర్శిస్తారు. మొత్తానికి దానికి వచ్చే షేర్స్, కామెంట్స్ వల్ల మీకు మరో కొత్త ఐడియా తడుతుంది. మిమ్మల్ని మీరు ఎలా మలచుకోవాలో కూడా తెలుస్తుంది. ఓన్లీ సోషల్ మీడియా కారణంగా.
మోటివేటివ్ అండ్ ఎమోషన్
కొన్నిసార్లు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి మర్చిపోవచ్చు కానీ అవి ప్రయోజనం కలిగించేవి అయితే వాటిపని అవి చేస్తూనే ఉంటాయి. ఎంతోమంది వాటి ఆధారంగా కొత్త విషయాలు, గుణపాఠాలు నేర్చుకుంటారు. కొన్ని సోషల్ మీడియా పోస్టులైతే వ్యవస్థను, వ్యక్తులను మోటివేట్ చేయడానికి, ప్రక్షాళన చేయడంలో కూడా కీ రోల్ పోషిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రామాలు, మెట్రో సిటీస్‌లోని ప్రజల ఎమోషన్స్‌ను ఎనలైజ్ చేసినప్పుడు అనేక విషయాలు తెలుస్తాయని లండన్ అండ్ సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సోషల్ సైంటిస్టుల స్టడీలోవెల్లడైంది. ప్లాస్‌వన్ అనే ఒక జర్నల్ ప్రకారం వివిధ లొకేషన్ల నుంచి యువత, వివిధ తరగతుల ప్రజలు చేసిన సోషల్ మీడియా పోస్టులను నిపుణులు పరిశీలించారు. అయితే ఆయా సందర్భాల్లో, ఆయా ప్రదేశాల్లోని వ్యక్తులు చేస్తున్న ట్వీట్లు, పోస్టులు సమాచారాన్ని అందించడమే కాదు, భావోద్వేగాలను వెల్లడిస్తాయని, సమస్య పరిష్కారానికి మీడియేటర్‌గా నిలుస్తాయని తేలింది.
మోర్ బెనిఫిట్స్
ప్రజలు చేసే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చాలా విషయాలు తెలుస్తాయి. ఇక ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ లొకేషన్‌లో ఒక సమస్యపై, ఒక కొత్త విషయంపై ఎక్కువ పోస్టులు వస్తున్నాయో ఎనలైజ్ చేయడంవల్ల ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. కొన్నిసార్లు పాలకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఏరియాకు లేదా దేశానికి సంబంధించి సమస్యతో కూడిన పోస్టులు ఎక్కువ వైరల్ అవుతుంటే గనుక పరిష్కరించే దిశగా ప్రభుత్వాలో, ప్రయివేటు సంస్థలో స్పందించకుండా ఉండలేవు. అలాగే వ్యక్తులు కూడా తాము ఎమర్జెన్సీలో, ప్రమాదాల్లో, ఆపదలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఆశ్రయించడంతో ప్రభుత్వాలు, పోలీసులు, పౌర సమాజం, యువత స్పందించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ప్రమాదాల నుంచి బయట పడుతున్నారు. కేటగిరీని బట్టి విభజించి విశ్లేషించడం ద్వారా సోషల్ మీడియా పోస్టులు దేశాభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికల విభాగానికి ఎంతో సహాయపడవచ్చు అంటున్నారు జపాన్‌లోని క్యోటో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ అండ్ హ్యూమన్ సైన్సెస్ పరిశోధకులు. ప్రజెంట్ ఇక్కడ భూకంప బాధితుల సమాచారం ప్రపంచానికి తెలియడంలో, ప్రపంచం వెంటనే రియాక్ట్ అవడంలో, సహాయం చేయడంలో సోషల్ మీడియా కీలకంగా పనిచేసిందంటున్నారు. దీనినిబట్టి ఎవరికైనా అర్థమైన విషయం ఏంటంటే.. భవిష్యత్తులో అతిపెద్ద సమాచార వ్యవస్థగా సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతుంది.
Read More..
Viral News: సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నెట్టిన్ట్లో అమ్మాయిల హల్చల్..