AC effect : ఏసీలో ఎక్కువసేపు ఉంటే చర్మం దెబ్బతింటుందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

AC effect : ఏసీలో ఎక్కువసేపు ఉంటే చర్మం దెబ్బతింటుందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Update: 2025-04-14 12:02 GMT
AC effect : ఏసీలో ఎక్కువసేపు ఉంటే చర్మం దెబ్బతింటుందా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : అసలే వేసవి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనానికి చాలా మంది ఏసీని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వర్క్ ప్లేస్‌లలో ఉద్యోగులైతే డ్యూటీ అయిపోయేదాకా ఏసీ(AC) రూముల్లో గడుపుతుంటారు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేయడంలో తప్పులేదు. కానీ అందరి శరీర తత్వం ఒకే విధంగా ఉండదు కాబట్టి కొందరికి ఏసీ పడకపోవచ్చు లేదా ఎక్కువసేపు ఆన్‌లో ఉంటే అలర్జీలకు గురికావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత అదే పెద్ద ఆరోగ్య సమస్యగా మారవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే ఏసీ అలర్జీ లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎలాంటి సమస్యలు వస్తాయి?

ఎక్కువసేపు ఏసీ(AC)లో ఉండటం వల్ల లేదా ఏసీ పడకపోవడంవల్ల చర్మంలో మార్పులు వస్తాయి. అలర్జీలు ఉన్నవారికి చర్మం అధికంగా పొడిబారడం, దద్దుర్లు రావడం వంటివి జరగవచ్చు. కొందరికి ఎగ్జిమా వంటి సమస్యలకు దారితీయడం వల్ల చర్మం నిర్జీవంగా మారే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా చర్మం ఆయిలీగా మారడం, కళ్లచుట్టూ పగుళ్లు, బ్లాక్ సర్కిల్స్ ఏర్పడటం, ముఖంలో వృద్ధాప్య లక్షణాలు వంటి లక్షణాలకు దారితీసే అవకాశం ఉంటుంది.

రాకుండా ఏం చేయాలి?

అధిక ఉష్ణోగ్రతలవల్ల ఓ వైపు ఏసీ వాడకుండా ఉండలేరు. ఇంకోవైపు అధికంగా వాడితే అలర్జీలు, ఇతర అనారోగ్యాలు వస్తాయి. ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏసీ టెంపరేచర్‌‌ను 24 –26°C మధ్యలో ఉంచాలి. తక్కువగా అంటే.. 18–20°C మధ్య ఉంచితే గాలి పూర్తిగా పొడిబారుతుంది. కాబట్టి హానికరం కానీ ఒకే లెవెల్ చల్లదనం కోసం 24–26°C మధ్యలో ఉంచడం మంచిది. దీనివల్ల చర్మం తేమను కోల్పోకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఏసీ ఫిల్టర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. 

Tags:    

Similar News