పెళ్లి చేసుకుని విడిపోయేకన్నా.. చేసుకోకపోవడమే మంచిదంటున్న సిగింల్స్.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన నిపుణులు
ఈ మధ్య కాలంలో పెళ్లి కి విలువ లేకుండా పోయింది.
దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లి కి విలువ లేకుండా పోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రేమ అంటున్నారు.. ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు.. నెలలు కూడా కలిసి ఉండకుండానే.. విడాకులు తీసుకుంటున్నారు. ఇక్కడ లోపం ఎవరిదో నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇంకా చెప్పాలంటే పెద్దలు సమక్షంలో జరిగిన పెళ్లిళ్లు కూడా నిలబడటం లేదు. పెళ్లి తర్వాత వేరే వాళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం ఇక్కడ ప్రధాన కారణమని చెబుతున్నారు. తాజాగా సింగిల్స్ మీద చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
నూటికి 70 మంది అబ్బాయిలు పెళ్లిని నిరాకరిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో పెళ్లి బంధాన్ని వారు నమ్మడం లేదు. పెళ్లి చేసుకున్నా మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు కదా.. చిన్న గొడవ జరిగినా వెంటనే పుట్టింటికి ఫోన్ చేసి చెబుతారు.. ఇంకేముంది ఏదో చేసేస్తున్నట్టు ఇళ్ల మీద అందరూ పడి పోతారు. అంతే ఇక అక్కడ నుంచి గొడవలు మొదలైనట్లే.. అబ్బాయిలు చెబుతున్నారని తేలింది.
నూటికి 50 మంది అమ్మాయిలు కూడా పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. పెళ్లి తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదా.. వాళ్ళతో మాట్లాడితే తప్పు బట్టి అక్రమ సంబంధం అంటగట్టి విడాకులు వరకు తీసుకెళ్తారు. వారు అయితే గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంత సేపు అయినా మాట్లాడుకోవచ్చు.. అమ్మాయిలు మాట్లాడితే సమాజం కూడా తప్పు పడుతుందంటూ .. పరిశోధనలో తేలింది.
ఇలా పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలు.. పెళ్లి చేసుకుని విడిపోయేకన్నా.. చేసుకోకుండా ఉండటమే మంచిదంటున్నారు. ముందు ముందు పెళ్లిళ్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.