Simple tips : కొత్త పాత్రల పై అంటుకున్న స్టిక్కర్లు తొలగించలేకపోతున్నారా.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..
వంటగదిలో అనేక రకాల పాత్రలను ఉపయోగిస్తారు. నిరంతర వినియోగించడం వల్ల చాలా సార్లు పాత్రలు అరిగిపోతాయి.
దిశ, ఫీచర్స్ : వంటగదిలో అనేక రకాల పాత్రలను ఉపయోగిస్తారు. నిరంతర వినియోగించడం వల్ల చాలా సార్లు పాత్రలు అరిగిపోతాయి. కుక్కర్ సరిగా పనిచేయకపోవడం. స్టీల్ ప్లేట్లు, చెంచాలు, గిన్నెలు, గ్లాసులు అన్నీ పాతవిగా కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు స్టీలు లేదా గాజు లేదా నాన్ - స్టిక్ పాత్రలు ఉపయోగించినా, అవి పాడైపోయినప్పుడల్లా, మీరు కొత్త వాటిని కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళుతుంటారు.
మీరు మీ అవసరాలకు అనుగుణంగా కొత్తపాత్రలను కొనుగోలు చేస్తారు. మీరు వాటిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, పాత్రల పై స్టిక్కర్లు అంటుకోవడం గమనించవచ్చు. కొన్నిసార్లు ఇవి లోపల ఇరుక్కుపోతాయి. పాత్రను వేడి చేసినప్పుడు, ఈ స్టిక్కర్ కూడా మీ ఆహారంతో మిళితం అవుతూ ఉంటుంది.
దాన్ని తీసివేయడానికి మీరు కొన్నిసార్లు గోరు లేదా కత్తిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం ద్వారా పాత్రల పై గుర్తులు పడతాయి. మీరు నాన్‌స్టిక్ పాత్ర పై కత్తితో గీస్తే దాని అచ్చులు పడతాయి. దీంతో పాత్రలు కూడా అందవిహీనంగా కనిపిస్తాయి. అందుకే ఇంటి చిట్కాలను ప్రయోగించి స్టిక్కర్లను ఈజీగా తీసేయవచ్చు. ఇంచి చిట్కాలను ఉపయోగించడం ద్వారా జిగురు మరక దాని పై కనిపించదు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త పాత్రలను తీసుకున్నప్పుడు దాని నుండి స్టిక్కర్‌ను తీసివేయడానికి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి. స్టిక్కర్ ఉన్నవైపు గ్యాస్‌కు కొద్దిగా పైన ఉంచి, దానిని తేలికగా వేడి చేయండి. ఇప్పుడు మీరు స్టిక్కర్‌ను సులభంగా తొలగించవచ్చు.
స్టిక్కర్ తొలగించిన తర్వాత గ్లూ స్టెయిన్ ఉంటే, దాన్ని కూడా తొలగించడానికి ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి. దీని కోసం, స్టిక్కర్ మరక ఉన్న ప్రాంతంలో కొద్దిగా ఉప్పు, ఒక చుక్క నూనె కలపండి. ఇప్పుడు మీ వేలితో రుద్దండి. ఇప్పుడు టిష్యూ పేపర్‌తో తుడవండి. గమ్ జాడ ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఇది చాలా సులభమైన పని కదా.. మీరూ కొత్త పాత్రలను ఓపెన్ చేసినప్పుడు ఈ టిప్ ని తప్పక పాటించండి..