మీ పిల్లలకు కూల్ డ్రింక్స్ తాగిస్తున్నారా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా..

ఇంట్లో పెద్దవారు శీతల పానీయాలు తాగడం చూసి పిల్లలు కూడా తమకు కావాలంటూ మొండికేస్తూ ఉంటారు.

Update: 2024-04-07 03:53 GMT

దిశ, ఫీచర్స్ : ఇంట్లో పెద్దవారు శీతల పానీయాలు తాగడం చూసి పిల్లలు కూడా తమకు కావాలంటూ మొండికేస్తూ ఉంటారు. దీంతో చేసేదేమీ లేక చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు శీతల పానీయాలు ఇవ్వక తప్పదు. కానీ ఈ పట్టుదల పెరిగే కొద్ది అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అయితే శీతల పానీయాల వల్ల కలిగే హాని గురించి మనందరికీ తెలుసు. అయినప్పటికీ మనం దానిని తాగకుండా ఆగలేము అలాగే పిల్లలని కూడా ఆపలేకపోతున్నాము. శీతల పానీయం తాగేటప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంటాము. కానీ భవిష్యత్తులో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఇక పిల్లలకు శీతల పానీయాలు ఇవ్వడం గురించి మాట్లాడితే వాటిని ఎంత దూరంగా ఉంచితే, వారి ఆరోగ్యానికి అంత మంచిది. నిజానికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాని అనేక వస్తువులను తినిపిస్తూ ఉంటారు. వీటిలో శీతల పానీయం ఒకటి, ఈ సోడా డ్రింక్స్ పిల్లలకు ఇస్తే ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊబకాయం పెరుగుతుంది..

శీతల పానీయాలలో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది పిల్లలకు ఊబకాయం సమస్యను పెంచుతుంది. పిల్లలు దీనిని తాగినప్పుడు కేలరీలు పెరిగిపోతూ ఉంటాయి. దీని కారణంగా వారు చిన్నతనంలోనే స్థూలకాయానికి గురవుతారు. దీనికి బదులు తాజా పండ్ల రసాలు తాగే అలవాటును పిల్లలకు చేపించండి. దీనితో పాటు వీలైతే పిల్లల ముందు శీతల పానీయాలు తాగకండి.

దంతాలు చెడిపోతాయి..

శీతల పానీయాల తయారీలో చక్కెర, యాసిడ్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని కారణంగా పిల్లలకు దంత క్షయం, పసుపు రంగు సమస్య ఉండవచ్చు. దీనితో పాటు వారి దంతాలు కూడా బలహీనంగా మారవచ్చు.

మధుమేహం వచ్చే ప్రమాదం ..

శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల పిల్లల్లో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి, వారికి తక్కువ చక్కెర పానీయాలు, రసాలను ఇవ్వండి.

జంక్ ఫుడ్ అలవాటు..

శీతల పానీయాలు తాగే అలవాటు పిల్లల్లో అనారోగ్యకరమైన, జంక్ తినే అలవాటును పెంచుతుంది. ఈ కారణంగా వారు ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలకు బదులుగా బయట జంక్ తినడం ప్రారంభిస్తారు.

ఎముకలు త్వరగా బలహీనపడతాయి..

కొన్ని శీతల పానీయాలలో ఉండే రసాయనాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ రసాయనాలు పిల్లల ఎముకలను బలహీనపరుస్తాయి. వారు చిన్న వయస్సులోనే అనేక శారీరక సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

Tags:    

Similar News