Uric acid: యూరిక్ యాసిడ్ కంట్రోల్‌లో ఉండాలా..? ఈ జ్యూస్‌లు బెస్ట్..!

యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ల విచ్చిన్నం నుండి ఏర్పడే వ్యర్థం.

Update: 2024-11-30 12:41 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్ల విచ్చిన్నం నుండి ఏర్పడే వ్యర్థం. యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఆర్థరైటీస్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. అంతేకాకుండా తరచుగా చేతి వేళ్లు, మోకాళ్లు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా రక్తంలో విసర్జన సరిగా జరగకపోయినా యారిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోతుంది. ఇవి చిన్న స్ఫటికాలుగా మారి కీళ్లలో ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. కిడ్నీలో రాళ్లు, లివర్, గుండె సమస్యలు వస్తాయని నిపుణలులు చెబుతున్నారు. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని రకాల డ్రింక్స్‌ను ప్రతి రోజూ తాగడం మంచిది.

నిమ్మ, పొదినా: నిమ్మకాయ, పొదినా నీరు శరీరాన్ని ఆల్కలైజ్ చేసి, శరీరంలో పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. నిమ్మకాయ పుదీనా జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

పుచ్చకాయ జ్యూస్: పుచ్చకాయలో హైడ్రేటింగ్, సిట్రులిన్ వంటి పదార్ధాలు యూరిక్ యాసిడ్‌ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. తాజా పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్‌లా తీసుకోవడం ఉత్తమం.

కీరా జ్యూస్: కీరా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ రసం కలిపి తీసుకోవడం వల్ల లివర్, కిడ్నీల సమస్యలు తగ్గుతాయి. కీరాలో పొటాషియం, ఫాస్పరస్ కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యారెట్ జ్యూస్: తాజా క్యారెట్ జ్యూస్‌లో నిమ్మరసం కలిపి తాగితే, రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. క్యారెట్‌లో యాంటీఆక్సీడెంట్లు, విటమిన్-ఎ, ఫైబర్, బీటా వంటివి ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. నిమ్మకాయంలో ఉండే విటమిన్ -సి, ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

అల్లం టీ: ఇందులో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అల్లం ముక్కను వేడి నీటితో 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని రోజుకు 2 సార్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా తాగలేని వారు అల్లం టీ తీసుకోవచ్చు.

గ్రీన్ టీ: గ్రీ టీ అనేది బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటారు. ఇది శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే బయోయాక్టివ్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News