థైరాయిడ్ ఉన్నవారు వీటిని అసలు తీసుకోకూడదు?
మనలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. రక్తపోటు, షుగర్ లాగానే ఇది చాలా మందిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి వల్ల జీర్ణ సమస్యలు, హార్ట్ బీట్ లో మార్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి. సంతానోత్పత్తి సమస్యలు కూడా సంభవించవచ్చు. కానీ థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సోయా ఫుడ్స్
థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు ముఖ్యంగా సోయా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. దీనిలో ఆస్ట్రిజెన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది.
మిల్లెట్స్
వీటిలో ఉండే అపిజినిన్ అనే ఫ్లేవనాయిడ్ థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది, ఇది థైరాయిడ్ హార్మోన్‌కు అయోడిన్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. మిల్లెట్ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచిది, కానీ హైపోథైరాయిడిజం ఉన్న వారు, వారి ఫుడ్ లో మిల్లెట్‌ను అసలు చేర్చకూడదు.
కెఫిన్
ఉదయాన్నే థైరాయిడ్ మందులు తీసుకునే వారు కాఫీ తాగకపోవడమే మంచిది. మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మీరు థైరాయిడ్ వ్యాధితో బాధపడుతుంటే, కెఫిన్ ఉన్న వాటిని దూరం పెడితేనే మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.