ఈ యాప్ తో మొబైల్ లో డ్రోన్ షాట్ లు.. ఎలాగో తెలుసా..
చాలామందికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వీడియోలు తీయాలనుకుంటారు.
దిశ, ఫీచర్స్ : చాలామందికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వీడియోలు తీయాలనుకుంటారు. కానీ డ్రోన్ కొనడం అంటే అందరికీ బడ్జెట్ ఉండదు. అలాంటి వారి కోసమే ఓ సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ యాప్ ద్వారా డ్రోన్ తో తీసినట్టుగానే వీడియోలను తీయవచ్చు. అయితే మీరు యాపిల్ ఫోన్ వినియోగదారులై ఉండాలి. మరి ఆ యాప్ ఏంటి దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లూమా AI
లూమా AI యాప్ ద్వారా అద్భుతమైన 3D షాట్‌లను తీయొచ్చు. దీని కోసం, మీరు మీ ఫోన్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుండి లూమా AIని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏవైనా కొన్ని వీడియోలను తీసి ఈ యాప్‌లో వీడియోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత, మీ వీడియో 3డి డ్రోన్ షాట్‌గా మారుతుంది. ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో 4.7 రేటింగ్‌ను పొందింది. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, పోర్చుగీస్, స్పానిష్, థాయ్, టర్కిష్ భాషలలో అందుబాటులో ఉంది.
యాప్‌లో ఉండే ప్రత్యేకతలు
ఈ యాప్ లో వీడియోలు ఎడిటింగ్ కోసం vfx, డ్రాఫ్ట్ మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ యాప్‌లో మీరు ఫోటో, వీడియో రెండింటినీ ఎడిట్ చేయవచ్చును.
ఈ యాప్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోనవసరం లేదు. మీరు దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు.