ఆగష్టు నుంచి జీమెయిల్ సేవలు నిలిపివేత .. క్లారిటీ ఇచ్చిన గూగుల్ !
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు కలిగిన మోస్ట్ ఎఫెక్టివ్ టెక్ కమ్యూనికేటర్ ఏదైనా ఉందంటే అది జీమెయిల్ మాత్రమే. కానీ ఇక నుంచి మీకు దీని సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు కలిగిన మోస్ట్ ఎఫెక్టివ్ టెక్ కమ్యూనికేటర్ ఏదైనా ఉందంటే అది జీమెయిల్ మాత్రమే. కానీ ఇక నుంచి మీకు దీని సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆగస్టు ఫస్టు నుంచి జీమెయిల్ సేవలను నిలిపివేస్తున్నట్లు స్వయంగా గూగుల్ కంపెనీ పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ప్రజెంట్ ఎక్స్(ట్విట్టర్)సహా పలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది.
నేడు వరల్డ్‌వైడ్ మిలియన్లకొద్దీ ప్రజల జీవితంలో జీమెయిల్ వినియోగం ఒక భాగమైపోయింది. దీనిని యూజ్ చేయని వారంటూ దాదాపు ఎవరూ ఉండరు. ఫోన్లు, కంప్యూటర్లు, ఇంకా ఏ ఇతర డివైసెస్ లాగిన్ కావాలన్నా గూగుల్ ఎకౌంట్ ఉండాల్సిందే. అయితే ఇకపై యూజర్లకు జీమెయిల్ సేవలు అందుబాటులో ఉండవని, మెయిల్ పంపడం, స్వీకరించడం కుదరదని, ఆగస్టు నుంచి పూర్తిగా షట్‌డౌన్ అవుతుందని నెట్టింట ప్రచారం జరుగుతుండటంతో వినియోగదారుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీంతో గూగుల్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. జీమెయిల్‌ను మూసివేయడం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని వెల్లడించింది. కాగా కంపెనీ ఈ సంవత్సరం జీమెయిల్(Gmail)కు సంబంధించిన HTML వెర్షన్‌ను మాత్రమే మూసి వేస్తుందని, ఈ మెయిల్ సేవను కాదని ప్రముఖ టెక్ నిపుణుడు మార్షా కొల్లియర్ పేర్కొన్నారు.