అధిక బరువు ఈజీగా తగ్గాలా?.. జస్ట్ మూడు నెలలు స్కిన్నీ చేయండి !
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత వర్కవుట్ చేసినా తగ్గడం లేదా? అయితే ‘స్కిన్నీ డ్యాన్స్’ను ట్రై చేయండి అంటున్నారు నిపుణులు.
దిశ, ఫీచర్స్ : అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత వర్కవుట్ చేసినా తగ్గడం లేదా? అయితే ‘స్కిన్నీ డ్యాన్స్’ను ట్రై చేయండి అంటున్నారు నిపుణులు.ఎందుకంటే దీనివల్ల మీరు బరువు తగ్గడంలో సక్సెస్‌ఫుల్ అవుతారని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా రీసెర్చర్స్ పది వేర్వేరు సందర్భాల్లో ఒక్కో సెషన్‌లో 646 మంది అధికబరువు గల వ్యక్తులను అబ్జర్వ్ చేశారు. బాధితులు తమ బాడీతో పాటు కండరాలు, చర్మంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలు ప్రకంపనాలకు గురయ్యేలా ప్రభావితం చేసే స్కిన్నీ డ్యాన్స్ చేయాలని సూచించారు. అలా మూడు నెలలపాటు చేయడాన్ని పరిశీలించగా అత్యధికమంది బరువుతగ్గడాన్ని గుర్తించారు. అందువల్ల అధిక బరువు ఉన్న వ్యక్తులు బరువు తగ్గడానికి ఇక నుంచి డ్యాన్స్‌ఫ్లోర్‌కు వెళ్లడం మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు.
వాస్తవానికి స్కిన్నీ డ్యాన్స్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ లేదా ఊబకాయం ఉన్నవారిలో శరీర ద్రవ్యరాశి, నడుము చుట్టుకొలత, శరీర కొవ్వు, ఫ్యాట్ మాస్ ఇండెక్స్ గణనీయంగా మెరుగుపడతాయని పరిశోధకులు అంటున్నారు. అదనంగా.. డ్యాన్స్ అనేది రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఫిజికల్ ఫిట్‌నెస్, కాగ్నెటివ్ ఫంక్షన్స్‌ను ప్రేరేపిస్తుందని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. దీంతోపాటు డయాబెటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్, హైపర్ టెన్షన్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వంటి హెల్త్ కండిషన్స్‌ను మేనేజ్ చేయడంలో స్కిన్నీ డ్యాన్సింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. బాడీ ఫ్యాట్ లాస్ అవడంలో, శరీర కూర్పులోగణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని, అధిక సామర్థ్యాన్ని, ఆనందాన్ని పొందడంలో హెల్ప్ అవుతుందని పరిశోధకులు అంటున్నారు.