మావన శరరంలో కోట్లాది సూక్ష్మజీవులు.. మనుగడకూ అవే ప్రధానం !
మీకు తెలుసా? మానవ శరీరం కణ నిర్మితం. అయితే బాడీలో కణాల సంఖ్యకంటే కూడా సూక్ష్మజీవులే అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. 42 శాతానికి పైగా కణాలు ఉంటే, మిగతా భాగమంతా మన కంటికి కనిపించని సూక్ష్మ జీవులతో నిండి ఉంటుంది.
దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? మానవ శరీరం కణ నిర్మితం. అయితే బాడీలో కణాల సంఖ్యకంటే కూడా సూక్ష్మజీవులే అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. 42 శాతానికి పైగా కణాలు ఉంటే, మిగతా భాగమంతా మన కంటికి కనిపించని సూక్ష్మ జీవులతో నిండి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరికొన్ని సూక్ష్మ జీవులు ఆయా సందర్భాల్లో హాని కూడా చేస్తాయి. అలర్జీ నుంచి పార్కిసన్ వరకు వివిధ సందర్భాల్లో మైక్రోబయామ్స్ కారకాలుగా మారుతుంటాయని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లో మైక్రోబయోమ్ సైన్స్ విభాగం నిపుణులు చెప్తున్నారు. అందుకే రోజూ స్నానం చేస్తున్నప్పటికీ, పరిశుభ్రత పాటిస్తున్నప్పటికీ కొన్నిసార్లు బాడీలో పగుళ్లు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గి, హానిచేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగినప్పుడు ఇలా జరుగుతుందని జన్యు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
హ్యూమన్ బాడీని ప్రభావితం చేసే వాటిలో బాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆర్కీ వటి సూక్ష్మజీవులు ప్రధానంగా ఉంటాయి. వీటితోపాటు శరీరంలో ఉండే అత్యధిక సూక్ష్మజీవులు ఆక్సిజన్ అందని, చీకటి నిండిన మానవ పేగుల్లో నివాసం ఉంటాయి. ఇవన్నీ జీవక్రియల నియంత్రణలో తమ తమపాత్ర పోషిస్తుంటాయి. వాస్తవానికి మానవ జన్యుక్రమం(జీనోమ్)20 వేల జన్యువులతో తయారైంది. కానీ శరీరంలోని సూక్ష్మజీవులు మాత్రం 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉంటాయి. మానవుల డీఎన్‌ఏతో పాటు, పేగుల్లోని సూక్ష్మజీవుల డీఎన్‌ఏ కూడా కలిస్తేనే మనుషులు జీవించగలుగుతారు. అంటే ఇక్కడ సూక్ష్మజీవులు ఎంత కీలమో అర్థం చేసుకోవచ్చు. అయితే సూక్ష్మీజీవుల్లో మంచి, చెడు ప్రభావాలు కలిగించేవి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల సూక్ష్మ జీవులు జీర్ణక్రియలో మేలు చేస్తాయి. మరికొన్ని వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రిస్తాయి. ఇంకొన్ని వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు టీబీ, మశూచి వంటి సూక్ష్మజీవులు ప్రాణాంతకంగా కూడా మారుతుంటాయి. ఫైనల్‌గా మానవ శరీర నిర్మాణంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకం.