బ్రెయిలీని వేగంగా చదవగలిగే AI రోబోట్.. పరిశోధకుల మరో సృష్టి
ప్రజెంట్ నెట్టింట ఎక్కువగా ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ అంశాలపై డిస్కషన్ నడుస్తోంది. డీప్‌ఫేక్‌ల వల్ల తలెత్తే ప్రాబ్లమ్స్ మొదలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాల వరకు అనేకం ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ నెట్టింట ఎక్కువగా ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ అంశాలపై డిస్కషన్ నడుస్తోంది. డీప్‌ఫేక్‌ల వల్ల తలెత్తే ప్రాబ్లమ్స్ మొదలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాల వరకు అనేకం ఉన్నాయి. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి బ్రెయిలీ లిపికి సంబంధించిన అస్పష్టమైన ఇమేజెస్‌ను గుర్తించడం, చదవడం వంటి ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా సిస్టమ్ రోల్ రికగ్నేషన్‌ను ఇంప్రూవ్ చేశారు.
నిమిషానికి ఎంత వేగం?
మానవుల కంటే రెట్టింపు వేగంతో బ్రెయిలీని చదివే రోబోటిక్ సెన్సార్‌ను రీసెర్చర్స్ డెవలప్ చేయడంతో ప్రస్తుతం అంధులకు మరింత సౌకర్యంగా మారవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎందుకంటే ఈ కొత్త రోబోటిక్ సెన్సార్ బ్రెయిలీ టెక్ట్స్‌పై గైడ్ చేస్తుంది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో నిమిషానికి దాదాపు 315 పదాల పఠన వేగాన్ని సాధిస్తుంది. ఈ ఫీట్ స్పర్శ యొక్క సెన్సింగ్, అలాగే రోబోటిక్ డెక్స్‌టెరిటీ రంగాలలో గణనీయమైన పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందని నిపుణులు చెప్తున్నారు.
అసలు ఉద్దేశం వేరు..
తాజాగా రోబోట్ అభివృద్ధి ప్రాథమిక ఉద్దేశం అయితే వివిధ లోపాలు ఉన్న ఉన్న వ్యక్తులు చదవడంలో సహాయం చేయడం కాదని, హై-స్పీడ్ బ్రెయిలీ రీడింగ్‌లో దాని విజయం రోబోటిక్ సెన్సిటివిటీలో పురోగతికి గల సామర్థ్యాన్ని హైలైట్ చేయడాన్ని తాము పరిశీలించామని పరిశోధకులు అంటున్నారు. అధిక స్పర్శ, సున్నితత్వం అవసరం కారణంగా తాము బ్రెయిలీని టెస్టింగ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నామని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇది ఎలా సహాయపడుతుందనే విషయంపై మరింత క్లారిటీ రానుంది.