టీనేజ్ అమ్మాయిల విషయంలో పేరెంట్స్ పాత్ర.. ఆ విషయంలో అర్థమయ్యేలా వారికి ఎలా చెప్పాలి
ఈ రోజుల్లో పిల్లలపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసినదే.
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో పిల్లలపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసినదే. కాబట్టి ఈ సమయంలో పిల్లలకు తగు విలువైన సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందులోనూ స్పెషల్లీ అమ్మాయిల ఓవరాల్ డెవలప్‌మెంట్‌కి తల్లిదండ్రుల గైడెన్స్ కీలకం. పిల్లలు తమ తప్పులు, అనుభవాల నుండి నేర్చుకుంటారు. ఇదే సమయంలో ముఖ్యమైన జీవిత పాఠాలు తల్లిదండ్రుల నుంచే తెలుసుకుంటారు. అందుకే అమ్మాయిలకు టీనేజ్‌కు వచ్చినప్పటి నుంచే పేరెంట్స్ కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. భవిష్యత్తు గురించి అవగాహన కల్పించాలి. టీనేజ్‌కి వచ్చిన అమ్మాయిలకు ఇంట్లో పెద్దవాళ్లు మెన్‌స్ట్రువల్ హెల్త్, సెక్సువల్ ఇంటిమసీ, హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేయడం.. వంటి విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. వారి జీవితాలను ప్రభావితం చేయడంలో తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలి. అలాగే టీనేజ్ కుమార్తెలకు తల్లిదండ్రులు నేర్పాల్సిన విలువైన జీవిత పాఠాలు ఏవో తెలుసుకుందాం.
సెక్సువల్ ఇంటిమసీ:
ఆడపిల్లలు ఒక వయసుకు వచ్చాక శారీరక మార్పులు జరుగుతాయి. అందుకే పునరుత్పత్తి ఆరోగ్యం, సెక్సువల్ ఇంటిమసీ గురించి వారికి అవగాహన కల్పించడం అవసరం. సెక్స్ గురించి మాట్లాడటం కష్టంగా ఉన్నప్పటికీ, మీ కుమార్తెకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్, ఎర్లీ ఏజ్ సెక్స్ రిస్కుల గురించి వాస్తవాలు వివరించాలి.
మెన్‌స్ట్రువల్ హెల్త్:
పీరియడ్స్ ఉమెన్ జీవితంలో ఒక భాగం అనే విషయం తెలిసిందే. స్త్రీగా ఎదుగుతున్నప్పుడు, శరీరం బిడ్డను కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మీ కూతురికి చెప్పాలి. ప్రతి నెలలో 4-5 రోజులు పీరియడ్స్ రావడం, రక్తస్రావం వంటి వాటి గురించి వివరించాలి. ఆమెకు ప్రతి అడుగులో గైడెన్స్ చేయడంలో మీరున్నారనే భరోసా కలిగించాలి.
శరీరంతో ఆరోగ్యకరమైన సంబంధం:
శరీరంలో, శరీర భాగాల్లో ఏవైనా లోపాలు ఉంటే వారిపై సమాజం ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందానికి ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ కుమార్తె తనను తాను ప్రేమించుకోవడం, ఆమె శరీరాన్ని దాని లోని లోపాలను సహా అంగీకరించడం నేర్పండి. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదని గుర్తు చేయండి. కానీ ఇతరులను సంతోష పెట్టడానికి ఆమెలోని మంచిని ఎప్పుడూ మార్చవద్దు. ప్రతి బాడీ టైప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది, తమపై పాజిటివ్ వ్యూ డెవలప్ చేసుకోవాలి అని నేర్పించండి.
ఫ్రెండ్షిప్:
ప్రపంచంలోని కోట్లాది మంది వ్యక్తుల్లో, మంచి స్నేహితులను ఎంచుకోవడం చాలా కష్టం. మీరు ఎంచుకున్న స్నేహితులు మీకు ముఖ్యం, మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అందుకే తల్లిదండ్రులు తమ కుమార్తెలతో హెల్తీ ఫ్రెండ్‌షిప్ కలిగి ఉండాలి. అదేవిధంగా నిజమైన ఫ్రెండ్ షిప్ లు ఎలా ఉంటాయో చూపించాలి.
ప్రాక్టికల్‌గా ఉండటం:
ఇతరులను సంతోష పెట్టడానికి మిమ్మల్ని మీరు ఎప్పటికీ మార్చుకోకూడదు. జెండర్‌తో సంబంధం లేకుండా అమ్మాయిలు ప్రాక్టికల్‌గా ఆలోచించేలా మోటివేట్ చేయాలి. లవ్, రిలేషన్‌షిప్స్ గురించి ఆలోచించడానికి మెచ్యూరిటీ రావాలని తెలియజేయాలి.