రోబో చేతిలో మనిషి మొదటి మరణం... ఇక ప్రపంచం మానవుల చేతిలో లేనట్లేనా..

రోబోలు ఇప్పుడు వర్క్ లో మనుషులను రీప్లేస్ చేస్తున్నాయి. రెస్టారెంట్ లో సర్వీస్ అందించడం నుంచి ఆటోమేటిక్ మొబైల్ ప్రొడ్యూస్ వరకు అన్నింటిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

Update: 2024-09-12 12:35 GMT

దిశ, ఫీచర్స్ : రోబోలు ఇప్పుడు వర్క్ లో మనుషులను రీప్లేస్ చేస్తున్నాయి. రెస్టారెంట్ లో సర్వీస్ అందించడం నుంచి ఆటోమేటిక్ మొబైల్ ప్రొడ్యూస్ వరకు అన్నింటిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఆగితే మానవుల మీద ఎటాక్ చేస్తాయని.. ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాయనే భయం కూడా వెంటాడుతుంది. అయితే ఈ దాడి ఎప్పుడో జరిగిందని తెలుస్తుంది. ఫస్ట్ రోబో ఎటాక్.. 1979లోనే జరిగింది. IFLScience నివేదిక ప్రకారం... 45 సంవత్సరాల క్రితం మొదటిసారిగా రోబో ఒక వ్యక్తిని చంపింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. ఆ చంపబడిన వ్యక్తి పేరు రాబర్ట్ విలియంగా రికార్డుల్లో ఉంది.

25 ఏళ్ల రాబర్ట్ మిచిగాన్‌లోని ఫ్లాట్ రాక్‌లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ కాస్టింగ్ ప్లాంట్‌లో పనిచేశాడు. సంఘటన జరిగిన రోజున... అతను ఫ్యాక్టరీలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి కొన్ని పదార్థాలను తరలించే వ్యవస్థతో పని చేస్తున్నాడు.

అయితే ఆ సమయంలో యంత్రం సరైన రీతిలో పనిచేయడం లేదు కాబట్టి అతను లోపం సంభవించినట్లు అనుమానించాడు. తప్పు ఏమిటో చెక్ చేయడానికి షెల్వింగ్ యూనిట్ మూడవ అంతస్తులోకి ఎక్కాడు. అప్పుడే ఒక యాంత్రిక చేయి అతనిని వెనుక నుంచి చితకబాదింది. తోటి కార్మికులు కనుగొనబడటానికి ముందు యంత్రం మరో 30 నిమిషాల పాటు పని చేస్తూనే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

రోబోటిక్ వ్యవస్థ అతన్ని నిర్జీవ వస్తువుగా పరిగణించి.. స్టోరేజ్ యూనిట్ నుంచి తరలించింది. కాగా అతని కుటుంబం 1983లో.... ప్రమాదానికి కారణమైన యంత్రం తయారీదారు లిట్టన్ ఇండస్ట్రీస్‌పై దావా వేసింది. రోబోటిక్ చేయి గణనీయమైన శక్తితో కదులుతున్నప్పటికీ.. తగినంత భద్రతా పరికరాలు వ్యవస్థాపించబడలేదని వారు వాదించారు. ఇందుకు పరిహారంగా 15 మిలియన్ డాలర్లు అందించబడింది.

జపాన్, దక్షిణ కొరియాలో రోబోలు ఇద్దరు వ్యక్తులను చంపాయి. జపాన్‌లో 1981లో అకాషిలోని కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో 37 ఏళ్ల కార్మికుడు కెంజి ఉరాడా మెకానికల్ హాండ్ తో చంపబడ్డాడు. అతను కూడా పనిచేయని రోబోను తనిఖీ చేస్తున్నప్పుడే ఇది జరిగింది.

ఇక గత సంవత్సరం దక్షిణ కొరియాలో రోబో వ్యక్తిని చితకబాది చంపింది. అది మనిషికి, ఆహార పెట్టెలకు మధ్య తేడాను గుర్తించలేకపోయింది. రోబోటిక్ చేయి ఆ వ్యక్తిని కూరగాయల పెట్టె అనుకుని పొరపాటున పట్టుకుంది. కన్వేయర్ బెల్ట్‌పైకి నెట్టింది. దీంతో అతని ముఖం, ఛాతీ యంత్రం కింద నలిగినట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ పేర్కొంది.

Tags:    

Similar News