అది బ్లూ వేల్ కాదు.. ఈయోసిన్ యుగానికి చెందిన అతి పెద్ద జంతువు కావచ్చు !

భూమిపై ఇప్పటివరకు జీవించిన అధిక బరువుగల అతిపెద్ద జంతువు ఏది? అని గూగుల్ సెర్చ్ చేసిన వారికి వెంటనే ఎక్కువగా ప్రత్యక్షమయ్యే ఆన్సర్ ఏంటంటే.. ‘బ్లూ వేల్’. కానీ ఇక నుంచి ఇందులో మార్పు రావచ్చు. ఎందుకంటే

Update: 2023-08-03 08:11 GMT

దిశ, ఫీచర్స్  : భూమిపై ఇప్పటివరకు జీవించిన అధిక బరువుగల అతిపెద్ద జంతువు ఏది? అని గూగుల్ సెర్చ్ చేసిన వారికి వెంటనే ఎక్కువగా ప్రత్యక్షమయ్యే ఆన్సర్ ఏంటంటే.. ‘బ్లూ వేల్’. కానీ ఇక నుంచి ఇందులో మార్పు రావచ్చు. ఎందుకంటే.. సైంటిస్టులు ఇటీవల దక్షిణ పెరూ తీరప్రాంత ఎడారిలో జరిపిన తవ్వకాల్లో ఒక పాక్షిక అస్థిపంజరం బయటపడింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ ప్రాంతమంతా తిమింగలాలకు సంబంధించిన శిలాజాలతో నిండి ఉందట. తాజాగా కనుగొన్న అరుదైన పురాతన భారీ అస్థిపంజరానికి సైంటిస్టులు ‘పెరూసెటస్ కోలోసస్’ అని పేరు పెట్టారు. ఇది 38 నుంచి 40 మిలియన్ సంవత్సరాల కిందట ఈయోసిన్ యుగానికి చెందినదిగా గుర్తించారు.

కొత్తగా కనుగొన్న భారీ తిమింగలం ఇప్పటి వరకు అత్యంత భారీ జంతువుగా పరిగణించే నీలి తిమింగలం కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉందని సముద్ర పరిశోధకులు అంటున్నారు. గతంలో కనుగొబడిన ‘పాకిసెటస్ కోలోసస్’ల మినిమమ్ బాడీ మాస్ ఇండెక్స్ 85 టన్నులు, సగటు అంచనా 180 టన్నులు. కేవలం వాటి అస్థిపంజర ద్రవ్యరాశి మాత్రమే 5 నుంచి 8 టన్నుల వరకు ఉండవచ్చునని అంచనా వేయబడింది. అంటే ఇవి నీలి తిమింగలం కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువ పొడవు, బరువు కలిగి ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన పురాతన పెరుసెటస్ కోలోసస్‌ అనే జంతువు శిలాజం సుమారు 66 ఫీట్ల(20 మీటర్లు) పొడవు, 340 మెట్రిక్ టన్నుల వరకు బరువు కలిగి ఉంది. దీంతో అది బ్లూ వేల్స్, లార్జెస్ట్ డైనోసార్ల కంటే కూడా అధిక బరువు కలిగిన ‘పెరూవియన్ తిమింగలం’గా రికార్డుకెక్కిందని ఇటలీలోని పిసా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు, పాలియోంటాలజిస్ట్ జియోవన్నీ బియానుచి పేర్కొన్నాడు.


Similar News