Technology : పబ్లిక్ ప్లేస్‌లో పర్సనల్ విషయాలు.. మీకు మాత్రమే వినబడేలా..!
Technology : పబ్లిక్ ప్లేస్‌లో పర్సనల్ విషయాలు.. మీకు మాత్రమే వినబడేలా..!

దిశ, ఫీచర్స్ : మనం జర్నీలోనో, బయటి పరిసరాల్లోనో ఉంటాం. ఆ సమయంలో ఫోన్‌లో ఏదైనా పాటను వినాలనిపిస్తేనో, ఓటీటీలో మూవీ చూడాలనిపిస్తేనో ఏం చేస్తాం. సాధారణంగా హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ వాడుతుంటాం. ఒకవేళ అప్పుడు అవి అందుబాటులో లేకపోతే.. అనుకోకుండా మర్చిపోతే.. అయ్యో అనుకుంటాం. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ పెట్టి వినలేం కదా! విన్నా సరిగ్గా వినపడదు. ఇతర రకరకాల శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ.. భవిష్యత్తులో ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ కొత్త ఆడియో టెక్నాలజీని డెవలప్ చేశారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ (Pennsylvania State University)కి చెందిన పరిశోధకులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నిర్దిష్ట స్థలంలో వినిపించేలా?
బహిరంగ ప్రదేశంలో లేదా ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు వినాలనుకున్న శబ్దం మాత్రమే వినాలంటే ఇప్పటి వరకైతే కుదరని పని. కానీ ఇక నుంచి సాధ్యం కావచ్చు అంటున్నారు పరిశోధకులు. అల్ట్రాసౌండ్ కిరణాలు, శబ్ద మెటాసర్ఫేస్‌లను ఉపయోగిస్తూ వినగలిగే ఎన్ క్లేవ్‌లను పరిశోధకుడు అకౌస్టిక్స్ జియా జిన్ జే జాంగ్ (Jia-Xin "Jay" Zhong) నేతృత్వంలోని బృందం డెవలప్ చేసింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఈ అధ్యయన వివరాలు పబ్లిష్ అయ్యాయి. దీని ప్రకారం ఒక ధ్వని కేవలం ఒక నిర్దిష్ట స్థలంలో మాత్రమే వినిపించేలా కొత్త పరికరాన్ని రూపొందించారు. ఉదాహరణకు కారు సీటు లేదా తరగతి గదిలోని డెస్క్ వద్ద, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా వినాలనుకుంటే ఆ శబ్దంతోపాటు ఇతర శబ్దాలు రాకుండా కేవలం వినాలకున్నది మాత్రమే మనం వినగలుగుతామని రీసెర్చర్స్ చెబుతున్నారు.
ఎలా పనిచేస్తాయి?
పరిశోధకులు కొత్తగా డెవలప్ చేసిన వినగలిగే ఎన్‌క్లేవ్‌లు అల్ట్రాసౌండ్స్ కిరణాలు, అలాగే సౌండ్ మెటా సర్ఫేస్‌లను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన వినగలిగే శబ్ద తరంగాలను (individual auditory areas) క్రియేట్ చేస్తాయి. అంటే నిజానికి అల్ట్రాసౌండ్(Ultrasound rays) అనేది మానవవులు వినలేని హై ఫ్రీక్వెన్సీ (Above 20 kHz) ధ్వని తరంగాలతోనూ మిళతమై ఉంటుంది. కాగా కొత్త టెక్నాలజీతో రెండు అల్ట్రాసౌండ్ ట్రాన్స్ డ్యూసర్లు (Ultrasound transducers) అంటే ధ్వని ఉత్పత్తి చేసే పరికరాలు సెల్ఫ్ బైండింగ్ కిరణాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో (For example, 40 kHz and 39.5 kHz) ప్రయాణిస్తాయి. ఇక శబ్ద మెటాసర్ఫేస్‌లు అనేవి 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేయబడిన ప్రత్యేక పదార్థాలు. ఇవి ధ్వని తరంగాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ కిరణాలను బెండ్ (Make it bend) అయ్యేలా చేసి, ఒక నిర్దిష్ట స్థానంలో కలుసుకునేలా చేస్తాయి. ఈ ప్రత్యేక పరిస్థితులే బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కేవలం మనం ఏదైతే వినాలనుకుంటామో ఆ శబ్దాలను మాత్రమే వినేందుకు దోహద పడతాయి. అయితే ఈ పరికరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాకపోతే మరిన్ని పరిశోధనల తర్వాత వాటిని మార్కెట్లోకి తెచ్చే విషయమై పరిశోధకులు ఆలోచిస్తున్నారు.
ప్రయోజనాలు ఏమిటి?
పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన న్యూ ఆడియో టెక్నాలజీ పరికరం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోజువారీ జీవితంలో ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మారుస్తుంది. బహిరంగ ప్రదేశంలో కూడా వ్యక్తిగత ఆడియోజోన్ క్రియేట్ చేయడం ద్వారా, వ్యక్తులు తమకు మాత్రమే వినిపించేలా ప్రత్యేక శబ్దాలను వినవచ్చు. ఉదాహరణకు మ్యూజియంలో చాలామంది ఉంటారు. అనేక శబ్దాలు వినబడుతుంటాయి. అయితే అవన్నీ వినబడకుండా గైడ్ చెప్పే విషయాలు తాము మాత్రమే వినాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అట్లనే జర్నీలో మ్యూజిక్ వినవచ్చు. డ్రైవర్ నావిగేషన్ సూచనలను స్పష్టంగా వినవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో డిస్టర్బెన్స్‌లేని పర్సనల్ కన్వర్జేషన్‌ను కొనసాగించవచ్చు.