భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయా.. ఇలా చేసి చూడండి..

వాస్తు శాస్త్రంలో అనేక సమస్యలకు అనేక పరిహారాలు చెబుతుంటారు.

Update: 2024-09-24 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : వాస్తు శాస్త్రంలో అనేక సమస్యలకు అనేక పరిహారాలు చెబుతుంటారు. వీటిని చేయడం ద్వారా ఇంట్లో ఉన్న అనేక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. అలాగే కుటుంబంలో బంధువులు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కొన్ని రెమిడీస్ ఫాలో అవ్వడం వలన ఇంట్లో శాంతి నెలకొంటుందని చెబుతారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అటువంటి పరిష్కారాలలో ఒకటి కర్పూరం, లవంగాలు. ఈ రెండు పదార్థాలను కలిపి ఉపయోగించడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే లవంగం, కర్పూరంకి సంబంధించిన కొన్ని నివారణల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లవంగం, కర్పూరంతో పరిహారాలు..

పూజలో భాంగంగా కర్పూరంతో హారతి చేస్తుంటారు. ఇక లవంగం ఒక మసాలా, ఇది వంటగదిలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం, లవంగాలు గాలిని శుద్ధి చేయడానికి పని చేస్తాయి. దీన్ని వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా, సువాసనగా మారుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కర్పూరాన్ని వెలిగించడం ద్వారా దూరం చేసుకోవచ్చు. కర్పూరం, లవంగాలు సానుకూలతకు చిహ్నాలు.

వైవాహిక జీవితంలో గొడవలు చెలరేగుతున్నట్లయితే లవంగం, కర్పూరంతో నివారణలను చేయాలని చెబుతున్నారు పండితులు. ప్రతిరోజు మీ పడకగదిలో ఇత్తడి లేదా వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా భార్యభర్తల బంధం బలపడి పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని చెబుతున్నారు.

మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో 2 లవంగాలు, 1 కర్పూరం వేసి వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయంటున్నారు.

కుటుంబంలో కష్టాలు పెరిగితే ఒక కర్పూరం, 5 లవంగాలను వెండి పాత్రలో వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కుటుంబంలోని కష్టాలు తగ్గి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

మీరు గృహ సమస్యలతో బాధపడుతుంటే కొన్ని కర్పూరం, లవంగాలను కలిపి వెలిగించి ఆ పొగను ఇంటి అంతటా వ్యాపింపజేయాలని పండితులు చెబుతున్నారు. శనివారం లేదా ఆదివారం సాయంత్రం పూట కర్పూరం - లవంగాలు, ఏలకులను కలిపి వెలిగించేందుకు ప్రయత్నించవచ్చు. అయితే దీనిని మధ్యలో అస్సలు చల్లార్చవద్దని చెబుతున్నారు. అది బూడిద రూపంలో వచ్చేవరకు ఉండి చల్లారిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లుకోవాలని చెబుతున్నారు.

అంతే కాదు డబ్బు కొరత ఉన్నట్టయితే ఈ రెండు వస్తువులను ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభం సమస్యతో అస్సలు బాధపడరని పండితులు చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. 


Similar News