రికార్డ్: స్పెర్మ్ డొనేట్ చేసి 500 మంది పిల్లలకు తండ్రైన వ్యక్తి

సాధారణంగా ఎవ్వరైనా ఇద్దరు లేదా నాలుగు పిల్లలకు జన్మనిస్తారు.

Update: 2023-05-07 09:41 GMT
రికార్డ్: స్పెర్మ్ డొనేట్ చేసి 500 మంది పిల్లలకు తండ్రైన వ్యక్తి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవ్వరైనా ఇద్దరు లేదా నాలుగు పిల్లలకు జన్మనిస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 500 మంది పిల్లలకు తండ్రి అయ్యి.. రికార్డు సృష్టించాడు. వివరాల్లోకెళ్తే.. జానథన్ జేకబ్ మేజిర్ అనే వ్యక్తి నెదర్లాండ్‌కు చెందిన వాడు. ఇతడు 2007 నుంచి చాలా మందికి స్పెర్మ్ డొనేట్ చేస్తూ వచ్చాడు. కాగా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయట తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ సంఘటనపై ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు జానథన్ స్పెర్మ్ డొనేట్ చేయడాన్ని నిషేధించింది. అలాగే స్పెర్మ్ డొనేట్ చేసేందుకు ప్రయత్నించినా కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 

Tags:    

Similar News