క్యాట్‌వాక్ సోయగాలు.. ర్యాంప్ వాక్ హొయలు.. పర్యావరణంపై ‘ఫ్యాషన్’ ఎఫెక్ట్ !
ఇటీవల ప్రారంభమైన లండన్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్స్ ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. వెలుగు జిలుగుల సెట్టింగులతో కూడిన వేదికపై డిఫరెంట్ కలర్లు, డిజైన్లతో కూడిన బ్రాండ్స్ ధరించి మోడల్స్ క్యాట్‌వాక్, ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ చూసి మురిసిపోయారు.
దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్రారంభమైన లండన్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్స్ ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. వెలుగు జిలుగుల సెట్టింగులతో కూడిన వేదికపై డిఫరెంట్ కలర్లు, డిజైన్లతో కూడిన బ్రాండ్స్ ధరించి మోడల్స్ క్యాట్‌వాక్, ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ చూసి మురిసిపోయారు. భారత దేశం నుంచి కూడా ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ముఖ్యంగా యువత ఈ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను బాగా ఎంజాయ్ చేసింది. అయితే ఫ్యాషన్ పోకడలపై ఉన్న ఆసక్తి కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే జర్చ జరుగుతోంది. మరోవైపు పర్యావరణ వేత్తలు దుస్తులు, లిఫ్ స్టిక్స్, పర్సనల్ కేర్ వస్తువులు, పాదరక్షలు వంటివి తయారు చేయడానికి వాడే ప్లాస్టిక్స్, లెడ్స్, కెమికల్స్, ఇతర హానికర పదార్థాలు సమాజంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతాయని, పర్యావరణ కాలుష్యానికి దారితీస్తాయని చెప్తున్నారు.
వనరులు కలుషితం
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు ఫ్యాషన్ ఇండస్ట్రీ కేంద్రంగా మారుతోందనే ఆందోళన చాలా రోజులుగా ఉంది. రోజురోజుకూ డెవలప్ అవుతున్న ఈ పరిశ్రమ వరల్డ్‌వైడ్‌గా 80 బిలియన్ల ఫ్యాషన్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ పర్యావరణాన్ని విస్మరిస్తోంది. కొత్త బట్టల తయారీలో ఓన్లీ రీసైక్లింగ్ చేసే దుస్తువల్లనే 10 శాతం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువడుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇక అదర్ ఫ్యాషనబుల్ బ్రాండ్స్‌లో ఉపయోగించే పలు ఉత్పత్తులు, ఫైబర్లు, కెమికల్స్ వంటివన్నీ గాలి, నీరు, నేల క్షీణతతో సహా వివిధ రకాల వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. నేడు వస్త్ర పరిశ్రమ ప్రపంచంలోనే మంచినీటి వనరులను కలుషితం చేస్తున్న వాటిలో రెండవస్థానంలో ఉంది.
వ్యర్థాలతో నీటి కాలుష్యం
యునైటెడ్ స్టేట్స్‌లో 64.5% గార్మెంట్ వేస్టేజెస్ ప్రజల నివాసిత ప్రాంతాల్లో, సముద్రాల్లో, జలాశయాల్లో కలిసిపోయాయి. ఇక రీసైక్లింగ్ ప్రాసెస్‌లో అయితే ప్రపంచంలో 19.3% ఎనర్జీ వృథా అవుతోంది. పైగా16.2% మాత్రమే రీసైకిల్ చేయబడుతుంది. దుస్తుల తయారీ, రీసైక్లింగ్ కారణంగా వెలువడే రంగుల కెమికల్స్‌తో కలుషితం అయ్యే నీటివినియోగంవల్ల మనుషులు, పక్షులు, ఇతర జీవరాశులకు హాని జరుగుతోంది. విక్రయించబడని దుస్తులను కాల్చినప్పుడు వాతావరణంలోకి CO 2 విడుదల అవుతోంది. ప్లాస్టిక్ అండ్ సింథటిక్ వస్త్రాలు రెండూ పాలిమర్ అనే రసాయనం కలిగి ఉండటంవల్ల గాలిలో, నేలలో, నీటిలో మైక్రో ఫైబర్ కాలుష్యానికి కారణం అవుతోంది. ఏటా మురుగునీటి కాల్వల ద్వారా 22 కిలోటన్నుల మైక్రోఫైబర్‌లు పరిసరాల్లో కలిసిపోతున్నాయి.
ప్రత్యామ్నాయాలు అవసరం
ఫ్యాషన్ పరిశ్రమలో, ఇతర సౌందర్య సాధనాల ఉత్పత్తి రంగంలో ప్రతికూల పర్యావరణానికి, సామాజిక ప్రభావాలకు దోహదం చేసే దుస్తులు, వస్తువుల ఉత్పత్తికి స్వస్తి పలకాలని, అందుకోసం ప్రత్యామ్నాయం ఆలోచించాని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంధన వనరులను ఖర్చు చేయడం, ఎనర్జీని వృథా చేయడం, కర్బన ఉద్గారాలు, నీటి వినియోగం తగ్గించాలి. పర్యావరణంపై ఫ్యాషన్ ఇండస్ట్రీ నెగెటివ్ ఇంపాక్ట్ చూపకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో సహా న్యూ టెక్నాలజీని వినియోగించుకోవాలి. దీంతోపాటు వస్త్ర పరిశ్రమకోసం ఆర్గానిక్ కాటన్, జనపనార, వెదురు వంటి మెటీరియల్స్‌పై ఫోకస్ చేయాలని, సస్టైనబుల్ ఫ్యాషన్ విషయంలో కన్జ్యూమర్స్, వెండర్స్, సప్లయర్స్, ఎడ్యుకేటర్స్, ఇన్‌స్టిట్యూట్స్, ఇండస్ట్రీ అసోసియేషన్స్ అండ్ బ్రాండ్స్, రిటైలర్లు పర్యావరణ స్పృహతో వ్యవహరింలని నిపుణులు సూచిస్తున్నారు.