అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు- కారణాలు- నివారణ..!!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్త్రీలు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

Update: 2024-03-31 12:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్త్రీలు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో బాధ పడుతోన్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జన్యుపరమైన కారణాలతో పాటు జీవన శైలిలో మార్పులు రావడం అండాశయ క్యాన్సర్‌కు ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధితో ఇప్పటికే ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినవారున్నారు. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, పెరిటోనియంలో ఎక్కడైనా ఈ క్యాన్సర్ ఉద్భవించవచ్చు. కాగా ప్రారంభ దశలోనే లక్షణాలను గుర్తించి.. వెంటనే వైద్యుడ్ని సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే ప్రాణాల్ని కాపాడుకున్నవారవుతారని నిపుణులు చెబుతున్నారు.

అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు..

* ఆకలి ఎక్కువగా వేయడం, కానీ త్వరగా కడుపు నిండిన అనుభూతి కలగడం

* ఆకస్మిక బరువు పెరగడం

* మలబద్ధకం వంటి పేగు అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడం

తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక

* pelvic లేదా పొత్తికడుపులో ఉబ్బరం, నొప్పి

* జీర్ణ సమస్యలు తలెత్తడం

* విపరీతమైన వెన్నునొప్పి రావడం

* పీరియడ్స్ సరిగా రాకపోవడం

* వచ్చినా రక్తస్రావం అధికంగా జరగడం

అండాశయ క్యాన్సర్‌కు కారణాలు..

కుటుంబంలో ఎవరికైనా ఒవేరియన్ క్యాన్సర్ ఉంటే.. అది వారి పిల్లలకు వచ్చే చాన్స్ ఉంటుంది. కొంతమంది పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. వీరిలో అండాశయ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లేని స్త్రీలకు, మెనోపాజ్ లేట్ గా వచ్చిన వారిలో, గర్భనిరోధక మందులు వాడే వారు, అధిక బరువు ఉండే వారిలో, ఒక మహిళ ఎక్కువ సార్లు అండాలను రిలీజ్ చేయడం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.

అంతేకాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో అండం విడుదల జరగదు. కాగా అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే 50 ఏళ్లు దాటిన మహిళల్లో కూడా అండాశయ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటున్నారు.

అండాశయ క్యాన్సర్ రిస్క్ ‌ను తగ్గించడం ఎలా?

ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడానికి.. తొలి దశలోనే నిర్ధారించడానికి సమర్థవంతమైన స్క్రీనింగ్ టెస్ట్ లంటూ ఏం లేవు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్ కు అసలు కారణం తెలియదు. తర్వాత స్టేజ్ లో నిర్ధారణ అయి.. విజయవంతంగా ట్రీట్‌మెంట్ కు అవకాశం ఉంటే కొంతమంది మహిళలు అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబులను గర్భాశయాన్ని, పొత్తికడుపులోని కొవ్వు కణజాల పొరను తొలగించుకుంటారు. అయితే నిపుణులు కింద చెప్పినవి పాటించడం వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బిడ్డకు స్వయంగా తల్లి పాలివ్వడం వల్ల అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. గర్భ నిరోధక మాత్రలు వేసుకోకూడదు. స్త్రీలు 26 ఏళ్లకు ముందే వివాహం చేసుకుని, గర్భం దాల్చి.. అది 9 నెలలు నిండే వరకు కొనసాగితే వారిలో అండాశయ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ వాడని మహిళల్లో, సరైన్ బరువు మెయింటైన్ చేసే వారిలో, పొగ తాగని వారిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భ కోశాన్ని తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్.. తర్వాత కూడా ఈ క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.


Similar News